ఒకటికన్నా ఎక్కువ పాన్​కార్డులు ఉంటే వెంటనే తిరిగి ఇచ్చేయాలీ...లేదంటే..?

శాశ్వత ఖాతా సంఖ్య (పాన్​)పై ఆదాయం పన్ను శాఖ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఒకటి కన్నా ఎక్కువ పాన్​కార్డులు ఉన్న వారిపై అదనపు కార్డులను వెంటనే తిరిగి ఇచ్చేయాలని ఆదేశించింది. లేనిపక్షంలో రూ.10 వేల జరిమాన విధిస్తామని తెలిపింది.
 

How to surrender additional PAN card and what are the consequences

న్యూఢిల్లీ: పాన్ కార్డుల వినియోగంపై కేంద్ర ఆదాయం పన్నుశాఖ (ఐటీ) ద్రుష్టిని కేంద్రీకరించింది. ఒక వ్యక్తి ఒకే శాశ్వత ఖాతా సంఖ్య (పాన్‌‌)ను కలిగి ఉండాలనే నిబంధనను అతిక్రమించిన వ్యక్తులపై ఆదాయం పన్ను శాఖ చర్యలను తీసుకోనున్నది. 

ఒకటి కంటే ఎక్కువ పాన్‌ కార్డ్‌లను కలిగిన వారికి రూ.10,000 జరిమానా విధించాలని నిర్ణయించింది. వివిధ కారణాల వల్ల ఒకటి కన్నా ఎక్కువ పాన్‌కార్డులను కలిగి ఉన్నవారు తమ వద్ద అదనంగా ఉన్న పాన్‌కార్డులను తిరిగి ఇవ్వడం ద్వారా ఇబ్బందుల నుంచి తప్పించుకునే అవకాశం ఆదాయం పన్ను శాఖ కల్పించింది. 

also read గూగుల్ సీఈఓకు వరుస షాక్​లు... గూగుల్​కు ఏమైంది?

ఒకటి కన్నా ఎక్కువ కార్డులు ఉంటే వెంటనే ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశాలు జారీచేసింది. రెండు కార్డులు ఉన్నాయా? సాధారణంగా ఎన్నారైలు ఈ విధంగా ఎక్కువ పాన్‌ కార్డులను కలిగి ఉంటారు. భారత్‌ను వీడి వెళ్లక ముందు వీరికి ఒక పాన్‌కార్డు ఉంటుంది. 

కొన్ని సంవత్సరాల అనంతరం స్వదేశానికి మళ్లీ వచ్చినప్పుడు వారు మరో పాన్‌ కార్డును తీసుకుంటారు. అంతేకాకుండా తమ పాన్‌ కార్డులో ఉన్న వివరాల్లో తప్పులు ఉన్నప్పుడు వాటిని సరి చేయవచ్చు. దానికి బదులు కొందరు మరో కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటారు. తొలికార్డును స్వాధీనం చేయకుండానే మరోదాన్ని పొందుతారు.

How to surrender additional PAN card and what are the consequences

వివిధ కారణాల రీత్యా ఒకటి కంటే ఎక్కువ పాన్‌కార్డులు ఉన్న వ్యక్తులు ఆదాయం పన్ను శాఖ విధించే జరిమానా, తీసుకునే చట్టపరమైన చర్యలకు గురికావలసి ఉంటుంది. దీని నుంచి తప్పించుకోవాలంటే వారు ఆన్ లైన్‌, ఆఫ్‌లైన్‌ విధానాల ద్వారా కూడా తప్పని సరిగా అదనపు పాన్‌ కార్డులను తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుంది. 

చాలా సులువైన విధానం ద్వారా అదనపు పాన్‌ కార్డులను ప్రభుత్వానికి అప్పగించొచ్చు. కేంద్రంలో నరేంద్రమోదీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆధార్, పాన్ కార్డుల అనుసంధాన ప్రక్రియ వేగవంతం చేసింది. వేతన జీవులు తమ ఏడాది వార్షిక ఆదాయంపై ఐటీ రిటర్న్స్ దాఖలు చేసినప్పుడు ప్రస్తుతం ఆధార్ నంబర్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. 

also read కొత్త విమానాశ్రయాన్ని నిర్మించనున్న జి‌ఎం‌ఆర్...ప్రభుత్వ అనుమతితో....

ఇంతకుముందు ఐటీ రిటర్న్స్ దాఖలు చేసినప్పుడు పాన్ కార్డు మాత్రమే నమోదు చేసేవారు. కానీ ఇప్పుడు ఆధార్ నంబర్ నమోదు చేయడం వల్ల దాంతోపాటు పాన్ అనుసంధానించే వారు. కానీ పాన్ కార్డులు లేని వారు ఆదార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

అలా దరఖాస్తు చేసుకోని వారికి ఈ ఏడాది ఐటీ రిటర్న్స్ దాఖలు చేసినప్పుడు అప్పటికప్పుడు ఈ-పాన్ కార్డు జారీ చేయాలని కేంద్ర ఐటీ శాఖ నిర్ణయించింది. తద్వారా తమ ఖజానాను నింపుకోవాలని తలపోస్తోంది. 

ఇందుకోసం ఆదాయం పన్ను చట్టం-1961 ప్రకారం ప్రతి ఒక్కరూ ఒక్క పాన్ కార్డు మాత్రమే కలిగి ఉండాలి. ఇదే చట్టంలోని 272బీ సెక్షన్ ప్రకారం ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు కలిగి ఉన్నవారు రూ.10 వేల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios