Asianet News TeluguAsianet News Telugu

పెన్షనర్లకు గుడ్ న్యూస్..వీడియో కాల్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయడం ఎలాగో తెలుసుకోండి..

SBI, బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా పింఛనుదారులు తమ లైఫ్ సర్టిఫికేటన్లను ఇంట్లో కూర్చొని వీడియో కాల్ ద్వారా సమర్పించడానికి అనుమతించాయి. పెన్షనర్లు కేవలం ఒక వీడియో కాల్ ద్వారా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించవచ్చు. దీని కోసం ఏమి చేయాలో స్టెప్ బై స్టెబ్ తెలుసుకోండి..

How to submit Life certificate through Video call
Author
First Published Nov 18, 2022, 8:46 PM IST

పెన్షనర్లు ప్రతి సంవత్సరం పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీ (PDA)కి లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాలి. దీని కోసం పింఛనుదారులు బ్యాంకు లేదా పోస్టాఫీసును సందర్శించి గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వచ్చేది. అయితే, ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వీడియో కాల్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడానికి అవకాశం ఇచ్చింది. 

SBI అధికారికి వీడియో కాల్ చేయడం ద్వారా పెన్షనర్లు లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించవచ్చు. వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా వీడియో కాల్ ద్వారా జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించడానికి నిబంధనలు రూపొందించబడింది. SBI ఈ సేవను ప్రారంభించడం గురించి ఖాతాదారులకు ట్వీట్ ద్వారా తెలియజేసింది. 

మరో ప్రధాన ప్రభుత్వ రంగ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా వీడియో కాల్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడానికి అనుమతించింది. కాబట్టి వీడియో కాల్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ ఎలా సమర్పించాలో తెలుసుకుందాం. 

SBI బ్యాంక్ 
వీడియో కాల్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించడానికి పెన్షనర్, పెన్షన్ ఖాతాను ఆధార్ కార్డ్‌తో లింక్ చేయాలి  .

స్టెప్  1: SBI అధికారిక PensionSeva వెబ్‌సైట్‌ను సందర్శించండి.
స్టెప్  2: ఎగువన ఉన్న 'VideoLC' లింక్‌పై క్లిక్ చేయండి. SBI పెన్షన్ సేవా మొబైల్ యాప్‌ని ఉపయోగిస్తున్నప్పుడు 'వీడియో లైఫ్ సర్టిఫికేట్ ట్యాబ్'పై క్లిక్ చేయండి.
స్టెప్  3: పెన్షన్ జమ చేయబడే ఖాతా నంబర్‌ను నమోదు చేయండి. ఆ తర్వాత క్యాప్చా కోడ్‌ను నమోదు చేయండి. ఆపై మీ ఆధార్ సమాచారాన్ని ఉపయోగించడానికి బ్యాంకును అనుమతించడానికి బాక్స్‌పై క్లిక్ చేయండి.
స్టెప్  4: ఖాతాని ధృవీకరించు బటన్‌పై క్లిక్ చేయండి. OTPని నమోదు చేయండి. 
స్టెప్  5: అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి. ఆ తర్వాత 'ప్రొసీడ్' పై క్లిక్ చేయండి.
స్టెప్  6:తదుపరి పేజీలో వీడియో కాల్‌ని షెడ్యూల్ చేయండి. దీనికి సంబంధించి మీరు మీ మొబైల్‌కి ఈ-మెయిల్,  సందేశాన్ని అందుకుంటారు.
స్టెప్  7: షెడ్యూల్ చేసిన సమయంలో వీడియో కాల్‌లో చేరండి. 
స్టెప్  8: వీడియో కాల్‌లో ఆథంటికేషన్ కోడ్‌ని నమోదు చేయండి. పాన్ కార్డ్ కూడా చూపించండి.
స్టెప్  9: మీ ఫోటో క్యాప్చర్‌ను సులభతరం చేయడానికి కెమెరాను సెట్ చేయండి.
స్టెప్  10: మీ సమాచారం నమోదు చేయబడిందని మీకు సందేశం పంపబడుతుంది. లైఫ్ సర్టిఫికేట్ 
సబ్మిషన్ స్టేటస్ SMS ద్వారా కూడా అందుబాటులో ఉంటుంది.

బ్యాంక్ ఆఫ్ బరోడా
స్టెప్  1:  tabit.bankofbaroda.com/lfcrt/#/requestని సందర్శించండి.
స్టెప్  2: PPO నంబర్ , ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి.
స్టెప్  3: ఆధార్ లింక్ చేయబడిన మొబైల్‌కి OTP పంపబడుతుంది. దాన్ని నమోదు చేసి సబ్మిట్‌పై క్లిక్ చేయండి.
స్టెప్  4: దీని తర్వాత పెన్షనర్ అక్కడ ఇచ్చిన నాలుగు ఆప్షన్‌లకు ఎస్/నో అని సమాధానం ఇవ్వాలి.
స్టెప్  5: ఇప్పుడు కాల్ చేయాలా లేదా తర్వాత కాల్ చేయాలా అని ఎంచుకోండి. 
స్టెప్  6: ఇన్‌కమింగ్ కాల్‌లో ఫోటో IDని చూపండి. దీన్ని సిబ్బంది స్కాన్ చేస్తారు.
స్టెప్ 7: ఫోటో తీసిన తర్వాత, OTP మళ్లీ మొబైల్‌కి పంపబడుతుంది. 
స్టెప్  8 : ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత, లైఫ్ సర్టిఫికేట్ పెన్షన్ సాఫ్ట్‌వేర్‌లో అప్‌డేట్ చేయబడుతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios