Asianet News TeluguAsianet News Telugu

Business Ideas: ఉన్న ఊరిలోనే టమాటా సాస్ వ్యాపారం చేయడం ద్వారా నెలకు రూ. 1 లక్ష ఆదాయం పక్కా..

ఏదైనా వ్యాపారం చేయాలని తలచుకుంటే నష్టాలు వస్తాయేమో అని  భయపడుతున్నారా, అయితే భయపడకండి.. తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ సంపాదించడమే మీ లక్ష్యమా, అయితే  అలాంటి వారికోసమే ఓ సూపర్ ఐడియా.

How to Start Tomato sauce business in India
Author
Hyderabad, First Published Aug 12, 2022, 5:07 PM IST

ప్రస్తుతం మార్కెట్‌లో టమాటా ధర భారీగా పడిపోయింది. పంట బాగానే ఉన్నా గిట్టుబాటు ధర రావడం లేదు. అందుకే చాలా మంది రైతులు వాటిని పారేస్తున్నారు. ఒక్కో సీజన్‌లో టమోటా ధర మారుతూ ఉంటుంది. ఒక్కోసారి కిలో రూ.100కి చేరితే.. ఒక్కోసారి రూ.20కి తగ్గుతుంది. ఇప్పుడు కూడా ధరలు బాగా తగ్గాయి. టమాటా కిలో రూ.5 పలుకుతున్నాయి. అలాంటి సమయంలో టమాటా సేకరించడం, సాస్ తయారు చేయడం, అమ్మడం వల్ల మంచి లాభం వస్తుంది. మీ ప్రాంతంలో టొమాటో సాస్ తయారీ యూనిట్‌ను ప్రారంభించడం వల్ల మంచి ఆదాయం వస్తుంది. 

టొమాటో దాదాపు అన్ని ఆహార పదార్థాలలో ఉపయోగిస్తారు. టొమాటో సాస్ పిజ్జా, బర్గర్, నూడుల్స్, ఫ్రైడ్ రైస్ మొదలైన వంటలలో అవసరం. అందుకే ఏడాదికి 12 నెలలు డిమాండ్‌ ఉంటుంది. అనేక రకాల ఫాస్ట్ ఫుడ్స్‌లో దీనిని ఉపయోగించడం వల్ల, టమోసా సాస్, కెచప్‌లకు డిమాండ్ పెరుగుతోంది. పెద్ద నగరాలు, చిన్న పట్టణాలు, గ్రామాలలో కూడా వీటికి మంచి మార్కెట్లు ఉన్నాయి. కాబట్టి టమోటా సాస్ వ్యాపారం మంచి లాభాన్ని పొందవచ్చు.

8 లక్షలు ఉంటే, మీరు వ్యాపారం ప్రారంభించవచ్చు!
టమాటా సాస్‌ తయారీ యూనిట్‌ ఏర్పాటుకు 7.82 లక్షల రూపాయలు అవసరం. 1.95 లక్షలు ఇందులో మీరు పెట్టుబడి పెట్టాలి. మిగిలిన నిధులను ముద్రలోన్ కింద ప్రభుత్వం నుంచి రుణంగా తీసుకోవచ్చు. సాస్ తయారీ యూనిట్ కు అవసరమైన యంత్రాలు, పరికరాలు రూ.2 లక్షల వరకు ఖర్చవుతున్నాయి. టమోటాలు, ఇతర ముడిసరుకులు, కూలీల వేతనాలు, ప్యాకింగ్, అద్దె తదితరాల కోసం వెచ్చించాల్సి ఉంటుంది.

ఈ వ్యాపారం తక్కువ స్థలంలో కూడా చేయవచ్చు!
టొమాటో సాస్ యూనిట్ సెటప్ చేయడానికి ఎక్కువ స్థలం అవసరం లేదు. ఒక చిన్న స్థలంలో ఇన్ స్టాల్ చేయవచ్చు. .ముందుగా పండిన టొమాటోలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని. వాటిని అధిక ఉష్ణోగ్రత వద్ద ఆవిరి కేటిల్‌లో ఉడికించాలి. ఆ తరువాత, గుజ్జు నుండి పై తొక్క మరియు విత్తనాలను వేరు చేసి అల్లం, వెల్లుల్లి, లవంగాలు, ఎండు మిరపకాయలు, ఉప్పు, పంచదార, వెనిగర్ లను జోడించాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ మొత్తం కూడా టమాటా సాస్ యంత్రాల ద్వారా జరుగుతుంది. బల్క్ ఆర్డర్ల కోసం 5 లీటర్లు, 10 లీటర్ల క్యాన్స్ ద్వారా విక్రయించవచ్చు. వీటిని హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, రెస్టారెంట్స్ వారు కొనుగోలు చేస్తారు. 

ఇక రిటైల్ మార్కెట్లో విస్తరించాలంటే ప్యాకింగ్ పై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఒక్క రూపాయి సాచెట్స్ నుంచి 1 లీటర్ బాటిల్స్ విక్రయించాల్సి ఉంటుంది.  అలాగే బ్రాండ్ నేమ్, లోగో రిజిస్ట్రేషన్, ఫుడ్ సేఫ్టీ సెక్యురిటీ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియా నుంచి పర్మిషన్, లాంటివి తెచ్చుకోవాలి. 

ప్రధాన మంత్రి ముద్ర నివేదిక ప్రకారం రూ.7.82 లక్షల పెట్టుబడితో ఏర్పాటు చేసిన టొమాటో సాస్ యూనిట్ రూ.28.80 లక్షల వార్షిక టర్నోవర్ చేస్తోంది. వార్షిక వ్యయం రూ.22.80 లక్షలు తీసివేస్తే రూ.6 లక్షలు మిగులుతాయి. అంటే.. మీ ఆదాయం ప్రతి నెలా 50 వేల రూపాయలు అవుతుంది. 

NOTE: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న నివేదికలు, సమాచారం ఆధారంగా మాత్రమే రూపొందించబడింది. ఈ వ్యాపారాన్ని ప్రారంభించే ముందు లోతైన అధ్యయనం చేయడం, సంబంధిత మార్కెట్ నిపుణులను సంప్రదించడం మంచిది

Follow Us:
Download App:
  • android
  • ios