Asianet News TeluguAsianet News Telugu

Business Ideas: బిజినెస్ చేయాలని మీరు గట్టిగా అనుకుంటున్నారా..తక్కువ పెట్టుబడితో ప్రతి నెలా ఆదాయం మీకోసం..

Business Ideas: బిజినెస్ చేయాలని మీరు గట్టిగా అనుకుంటే చాలు చాలా బిజినెస్ ఐడియాలు ఉన్నాయి. కొన్ని వ్యాపారాలు కొంచం పెట్టుబడితోనే చక్కటి ఆదాయాన్ని సంపాదించుకునేలా ఉంటాయి. ముఖ్యంగా అలాంటి బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారా. అయితే మీకు పీజీ హాస్టల్ చక్కటి ఉపాయం అని చెప్పొచ్చు.

How to Start Paying Guest Startup Hostel Business
Author
First Published Aug 24, 2022, 1:13 PM IST

మనం సిటీల్లో వర్కింగ్ మెన్, వుమెన్ హాస్టల్స్ చూస్తుంటాం. అయితే వీటిలో ఏం లాభం ఉంది అని మీరు అనుకోవచ్చు. కానీ మీకు ఇందులో చక్కటి ఆదాయం లభిస్తుంది. పైగా ప్రతి నెల స్టేబుల్ గా ఆదాయం లభించే అవకాశం ఇందులో పుష్కలంగా ఉంది. ఇందుకోసం మీరు చేయవలసిందల్లా ఒక్కటే. ఓపిక, నిర్వహణ, పెట్టుబడి, క్రమశిక్షణ, నాణ్యత ప్రమాణాలను పాటిస్తే చాలు చక్కటి లాభాలను పొందవచ్చు. 

ప్రస్తుతం సిటీలకు మాత్రమే పరిమితం అయిన ఈ కల్చర్ నెమ్మదిగా జిల్లా కేంద్రాలకు, ఎడ్యుకేషన్, పారిశ్రామిక హబ్ లకు విస్తరించింది. పారిశ్రామిక రంగం విస్తరిస్తున్న నేపథ్యంలో చాలా మంది వర్కింగ్ మెన్ హాస్టల్ వసతి గృహంలో ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు. రెంట్ తీసుకొని ఇల్లు మెయిన్ టెయిన్ చేసే బదులు, ఇలా పీజీ హాస్టల్ లో ఉంటే వారికి సమయం మిగిలిపోతుంది. అందుకే అటు వైపు చూస్తున్నారు. 

ఇక మీరు పీజీ హాస్టల్ నడపాలంటే, ముందుగా కావాల్సింది, మంచి సెంటర్, అంటే ఎడ్యుకేషనల్ సెంటర్లు, ఆఫీసులు, కర్మాగారాలకు దగ్గరలో ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. స్త్రీల కోసం పెడుతున్నారా, పురుషుల కోసం పెడుతున్నారో తీర్మానించుకోవాలి. రెండింట్లోనూ చక్కటి లాభం ఉంది. ముఖ్యంగా వర్కింగ్ మెన్ కన్నా కూడా వర్కింగ్ వుమెన్ హాస్టళ్లకే ఎక్కువ డిమాండ్ ఉంది. ఎందుకంటే మహిళలు భద్రత కోసం హాస్టల్స్ ను ప్రిఫర్ చేస్తారు. రెంట్ తీసుకొని ఇంట్లో ఉండేందుకు ఇష్టపడరు. 

పీజీ హాస్టల్ కోసం మీరు సెంటర్ ఎంపిక చేసుకొని సింగిల్ బెడ్రూం, డబుల్ బెడ్రూం ఫ్లాట్స్ ఉన్నటువంటి రెసిడెన్షియల్ అపార్ట్ మెంట్లను తీసుకోవడం ఉత్తమం. వీటిలో అయితే మీరు ఏడాది మొత్తానికి లీజు రూపంలో అద్దె చెల్లించి, హాస్టల్ నడుపుకోవచ్చు. ఇక హాస్టల్ ఏర్పాటు కు కావాల్సింది. బెడ్స్, రూం కెపాసిటీని బట్టి బెడ్స్ ఏర్పాటు చేయాలి. కిక్కిరిసి కాకుండా, కాస్త విశాలంగానే ఉంచాలి. అలాగే గదుల్లో ఫ్యాన్, కిటికీ సౌకర్యం ఉండేలా చూడండి. అలాగే మొబైల్ చార్జింగ్ కోసం ఎక్కువ పాయింట్లు ఉండేలా చూసుకోండి. ఇక అటాచ్డ్ బాత్రూం లేాదా కామన్ బాత్రూం ఉండేలా చూసుకోండి. 

ఇక మెస్ అన్నింటికన్నా ముఖ్యమైనది. మీరు మెస్ ద్వారా హాస్టల్ లో ఉండే వారికి టిఫిన్, భోజనం, డిన్నర్ ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. అలాగే సండే చికెన్ సర్వ్ చేయాల్సి ఉంటుంది. తద్వారా చక్కటి ఆదాయం సంపాదించుకోవచ్చు. ఇక అన్నింటికన్నా ప్రధానమైనది. క్లీనింగ్ సెక్షన్, బాత్రూంలు, అలాగే మెస్, క్లీన్ గా ఉండేలా చూసుకోవాలి. అలాగే వైఫై సౌకర్యంతో పాటు, సీసీ కెమరాలను సైతం ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. ఇక మెస్ టైమింగ్స్ పాటించాలి. అలాగే వర్కర్స్ ను పెట్టుకొని వారు లేని సమయంలో మరో వర్కర్ ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. పీజీ హాస్టల్ పైన తెలిపిన మూడు సూత్రాలతోనే నడుస్తుందని మరిచిపోవద్దు.  

Follow Us:
Download App:
  • android
  • ios