రిటైల్ పెట్టుబడిదారులు అలాగే పాలసీదారులు, ఉద్యోగులు ఎల్‌సి ఐ‌పి‌ఓ కోసం  ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దేశంలో ఇదే అతిపెద్ద ఐ‌పి‌ఓ, ఇందులో పాలసీదారులు చౌకగా షేర్లను పొందే అవకాశం ఉంది. పాలసీదారులు ఎంత డబ్బు పెట్టుబడి పెట్టవచ్చో తెలుసుకోండి..

న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద ఇన్షూరెన్స్ కంపెనీ ఎల్‌ఐసీ స్టాక్ మార్కెట్‌లో ఎంట్రీకి సిద్ధమైంది. అలాగే దేశంలోని అతిపెద్ద ఐ‌పి‌ఓని తీసుకురావడానికి కంపెనీ మార్కెట్ రేగులేటరీ సంస్థ సెబి (SEBI)కి ముసాయిదా డాక్యుమెంట్స్ సమర్పించింది. ఇష్యూలో 35 శాతం రిటైల్ ఇన్వెస్టర్లకు, 10 శాతం పాలసీదారులకు, 5 శాతం ఉద్యోగులకు రిజర్వ్ చేయబడుతుంది. దీని కోసం రిటైల్ ఇన్వెస్టర్లతో పాటు పాలసీదారులు, ఉద్యోగులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఎల్‌ఐసీకి చెందిన 26 కోట్ల పాలసీదారుల కోసం 3.16 కోట్ల షేర్లను రిజర్వ్‌లో ఉంచారు. కానీ పాలసీకి పాన్ లింక్ చేయబడిన లేదా డీమ్యాట్ ఖాతా ఉన్న పాలసీదారులు మాత్రమే దీని కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పాలసీ తప్పనిసరిగా 13 ఫిబ్రవరి 2022న లేదా అంతకు ముందు జారీ చేయబడి ఉండాలి. పాలసీదారులకు స్వంత పేరు మీద డీమ్యాట్ ఖాతా ఉండాలి. అలాగే ఫిబ్రవరి 28లోగా పాలసీ రికార్డులో పాన్‌ను అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది.

ఎల్‌ఐ‌సి ఇష్యూలో పాలసీదారులు గరిష్టంగా రూ. 4 లక్షల వరకు షేర్ల కోసం వేలం(auction) వేయవచ్చు . పాలసీదారుల కేటగిరీలో రూ. 2 లక్షలు, రిటైల్ కేటగిరీలో రూ. 2 లక్షలకు వేలం వేయవచ్చు. రెండు దరఖాస్తులు ఒకే డీమ్యాట్ ఖాతా నుండి చేసినప్పటికీ, దానిని చెల్లుబాటు అయ్యేదిగా పరిగణించబడుతుంది. పాలసీదారులకు ఎటువంటి లాగీన్ వ్యవధి ఉండదు ఇంకా వారు లిస్టింగ్ రోజునే షేర్లను విక్రయించవచ్చు.

అదేవిధంగా ఎల్‌ఐసీ ఉద్యోగులు గరిష్టంగా రూ.6 లక్షల వరకు వేలం వేయవచ్చు. వారు ఎంప్లాయీ కేటగిరీ, పాలసీ హోల్డర్ కేటగిరీ, రిటైల్ కేటగిరీలో ఒక్కొక్కరు రూ.2 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు. జాయింట్ డీమ్యాట్ ఖాతా విషయంలో ఎల్‌ఐ‌సి పాలసీదారులు ప్రాథమిక డీమ్యాట్ ఖాతాదారు అయితే మాత్రమే కోటా ప్రయోజనాన్ని క్లెయిమ్ చేయవచ్చు. జాయింట్ పాలసీదారుల విషయంలో, పాలసీదారులు రెండు కేటగిరీల కింద దరఖాస్తు చేసుకోవచ్చు కానీ దీని కోసం వారు ప్రత్యేక డీమ్యాట్ ఖాతాలను కలిగి ఉండాలి.