Asianet News TeluguAsianet News Telugu

టెన్నిస్ కి సానియా మీర్జా బై బై..? ఆమె సంపాదన, కార్ కలెక్షన్, ఇంటి విలువ ఎంతో తెలుసా..?

సానియా మీర్జా షోయబ్ ఇద్దరూ దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు. ఇద్దరూ తమ తమ దేశాలకు చెందిన దిగ్గజ ఆటగాళ్లు. షోయబ్ మాలిక్ కోట్ల ఆస్తికి యజమాని అయితే సానియా మీర్జా కూడా సంపాదనలో వెనుకంజలో లేదు. సానియా మీర్జా స్పొర్ట్స్ ద్వారా కోట్లు సంపాదిస్తుంది.

How much does Sania Mirza earn? Know the net worth of Indian star tennis player
Author
First Published Jan 7, 2023, 7:11 PM IST

భారత మహిళా టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా రిటైర్మెంట్ ప్రకటించింది. గత సంవత్సరం సానియా మీర్జా పాకిస్తానీ క్రికెటర్ అండ్ భర్త షోయబ్ మాలిక్‌తో విడిపోతున్నట్లు వార్తల ద్వారా వెలుగులోకి వచ్చింది. అయితే దీనిపై సానియా మీర్జా, షోయబ్ మాలిక్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. సానియా మీర్జా షోయబ్ ఇద్దరూ దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు.

ఇద్దరూ తమ తమ దేశాలకు చెందిన దిగ్గజ ఆటగాళ్లు. షోయబ్ మాలిక్ కోట్ల ఆస్తికి యజమాని అయితే సానియా మీర్జా కూడా సంపాదనలో వెనుకంజలో లేదు. సానియా మీర్జా స్పొర్ట్స్ ద్వారా కోట్లు సంపాదిస్తుంది, కానీ రిటైర్మెంట్ తర్వాత కూడా సానియా మీర్జా ఇతర మార్గాల ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు ఆర్జిస్తుంది. సానియా మీర్జా మొత్తం ఆస్తులు, ఇల్లు, కార్ల కలెక్షన్ సంపాదన గురించి తెలుసుకొండి..

సానియా మీర్జా సంపాదన
భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా కేవలం టెన్నిస్ ఆడటం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదిస్తుంది. సానియా మీర్జా ఏటా కోట్లలో సంపాదిస్తోంది. సానియా మీర్జా వార్షిక ఆదాయం దాదాపు మూడు కోట్ల రూపాయలు. క్రీడలే కాకుండా సానియా మీర్జా అనేక బ్రాండ్ అంబాస్దర్ ద్వారా కూడా సంపాదిస్తుంది. ఆమె బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల కోసం 25 కోట్లు వసూలు చేస్తుంది. చాలా బ్రాండ్‌లతో కూడా అనుబంధం ఉంది. ఇంకా సానియాకు సొంతంగా టెన్నిస్ అకాడమీ కూడా ఉంది.

 సానియా మీర్జా విలాసవంతమైన ఇల్లు
టెన్నిస్ ప్లేయర్  సానియా మీర్జా హైదరాబాద్ నివాసి. ఆమెకి హైదరాబాద్‌లో విలాసవంతమైన ఇల్లు ఉంది. దీంతో పాటు దుబాయ్‌లో ఓ ఇల్లు కూడా ఉంది. సానియా మీర్జా హైదరాబాద్ ఇంటి ఖరీదు దాదాపు రూ.13 కోట్లు. ప్రస్తుతం ఆమె దుబాయ్‌లోని తన ఇంట్లో ఉంటోంది.

సానియా మీర్జా కార్ కలెక్షన్
క్రీడాకారులకు లగ్జరీ వాహనాలంటే చాలా ఇష్టం. సానియాకు కూడా కోట్ల విలువైన వాహనాలున్నాయి. సానియా మీర్జా కార్ల కలెక్షన్స్ లో రేంజ్ రోవర్, మెర్సిడెస్ బెంజ్, ఆడి, బిఎమ్‌డబ్ల్యూ సిరీస్ వాహనాలు ఉన్నాయి.

సానియా మీర్జా నికర విలువ
ఒక నివేదిక ప్రకారం భారతదేశంలోని అత్యుత్తమ టెన్నిస్ క్రీడాకారిణులలో ఒకరైన సానియా మీర్జా మొత్తం ఆస్తుల గురించి మాట్లాడితే ఆమె సుమారు $ 25 మిలియన్లు అంటే దాదాపు 200 కోట్ల ఆస్తులకు యజమాని.

సానియా మీర్జా భర్త మొత్తం ఆస్తులు

సానియా మీర్జా లాగానే ఆమె భర్త షోయబ్ మాలిక్ కూడా పాకిస్తాన్ అగ్ర ఆటగాళ్లలో ఒకరు. షోయబ్ మాలిక్ సంపద కూడా దాదాపు సానియా మీర్జాతో సమానంగా ఉంది. మీడియా నివేదిక ప్రకారం, షోయబ్ మాలిక్ నికర విలువ 28 మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ. 228 కోట్లు. అతని సంపాదనలో ఎక్కువ భాగం క్రీడల నుండి వస్తుంది. దీనితో పాటు షోయబ్ బ్రాండ్ ఎండార్స్‌మెంట్ నుండి కూడా సంపాదిస్తాడు.

Follow Us:
Download App:
  • android
  • ios