Asianet News TeluguAsianet News Telugu

హోం లోన్ EMI ఇకపై మరింత భారం, వరుసగా 5వ సారి రెపో రేటు పెంచిన ఆర్బీఐ, 35 BPS పాయింట్లు పెంపు

ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపిసి) రెపో రేటును 35 బేసిస్ పాయింట్లు (బిపిఎస్) పెంచింది. దీంతో కీలక వడ్డీ రేటు 6.25 శాతానికి చేరినట్లు ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. అంతేకాదు ఆర్బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి అంచనాను 6.8 శాతానికి తగ్గించింది.

Home loan EMI now more burden RBI hikes repo rate for 5th consecutive time 35 bps point hike
Author
First Published Dec 7, 2022, 10:37 AM IST

కొత్త ఇల్లు కొనడం అనుకునేవారికి ఇది నిజంగానే షాకింగ్ న్యూస్, భారత రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ వరుసగా ఐదవ సారి రెపో రేట్లను పెంచింది. ఆర్బిఐ ఈసారి 35 బేసిస్ పాయింట్ల చొప్పున కీలక వడ్డీ రేట్లను పెంచింది. దీంతో రెపో రేటు 6.25 శాతానికి చేరింది. ఫలితంగా బ్యాంకుల నుంచి వడ్డీ రుణాలపై  వడ్డీలు మరింత పెరగనున్నాయి.  దీంతో కొత్త ఇల్లు కొనే వారికి ఇది ఒక రకంగా షాక్ అనే చెప్పాలి. 

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ)  గత మూడురోజులుగా సమావేశం అయిన ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి) నిర్ణయాలను బుధవారం ప్రకటించింది. ఈసారి కూడా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు వడ్డీరేట్లను పెంచుతూ ఎంపీసీ నిర్ణయం తీసుకుంది. ఎంపీసీ సమీక్షా సమావేశంలో రెపో రేటును పెంచడంతో బ్యాంకుల నుంచి పొందే రుణాల వడ్డీ రేట్లు కూడా ఆటోమేటిగ్గా పెరనున్నాయి. ఎందుకంటే వడ్డీ రేట్లు అన్నీ కూడా రెపో లింక్డ్ గా ఉంటాయి. 

వివరాల్లోకి వెళితే ద్రవ్య విధాన సదుపాయం (LAF) కింద పాలసీ రెపో రేటును 35 బేసిస్ పాయింట్లు లేదా 0.35 శాతం నుండి 6.25 శాతానికి పెంచాలని ద్రవ్య విధాన కమిటీ (MPC) ఈ రోజు తన సమావేశంలో నిర్ణయించింది. ఈ పెంపును కలిపితే, గత ఏడు నెలల్లో ఆర్‌బీఐ వడ్డీ రేట్లను పెంచడం ఇది ఐదోసారి. సెంట్రల్ బ్యాంక్ మేలో 0.40 శాతం, జూన్, ఆగస్టు, సెప్టెంబర్‌లలో 0.50-0.50-0.50 శాతం చొప్పున పెంచింది.

EMI పెరుగుతుంది, 
రెపో రేటు పెరుగుదల  ప్రత్యక్ష ప్రభావం ఏమిటంటే, మీ హోమ్ లోన్, ఆటో లోన్, ఇతర అన్ని రకాల రుణాలు ఖరీదుగా మారతాయి. ఆర్‌బిఐ వడ్డీ రేట్లు పెంచినప్పుడల్లా, దాని ప్రత్యక్ష ప్రభావం రుణ వడ్డీ రేట్ల పెరుగుదల రూపంలో కనిపిస్తుంది. 

రెపో రేటు అంటే ఏమిటి?
రెపో రేటు అంటే ఆర్‌బిఐ బ్యాంకులకు ఇచ్చే రుణం పై వడ్డీ రేటు. ఈ వడ్డీ రేటు పెంపు వల్ల బ్యాంకులు ఆర్బీఐకి ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. అప్పుడు బ్యాంకులు కూడా తమ కష్టమర్లకు ఇచ్చే రుణాలపై వడ్డీ రేటును పెంచుతాయి. తద్వారా రెపో రేటు పెరుగుదల కారణంగా, బ్యాంకు నుండి లభించే అన్ని రకాల రుణాలపై వడ్డీ రేటు పెరుగుతుంది. 

SLR అంటే ఏమిటి?
ప్రతి వాణిజ్య బ్యాంకు చట్టబద్ధమైన లిక్విడిటీ రేషియో (SLR)ని అనుసరించాలి. రుణం ఇవ్వడానికి ముందు బ్యాంకు ఆ మొత్తాన్ని నగదు, బంగారం నిల్వ, PSU బాండ్లు, సెక్యూరిటీలో RBI వద్ద ఉంచాలని నిర్ణయించిన రేటు ఇది.

ఇది మార్కెట్లో నగదు ప్రవాహాన్ని నియంత్రించడానికి ఉపయోగించబడుతుంది. మార్కెట్‌లో నగదు ప్రవాహం పెరిగితే ఆర్‌బీఐ దానిని కంట్రోల్ చేసేందుకు రెపో రేట్లను పెంచుతుంది.  మరోవైపు, నగదు ప్రవాహం పెంచాల్సి ఉంటే,  ఆర్‌బీఐ రెపో రేట్లను తగ్గిస్తుంది.

Follow Us:
Download App:
  • android
  • ios