న్యూ ఢీల్లీ: స్వాతంత్ర్య దినోత్సవం ఒక్కరోజు పక్కన పెడితే ఆగస్టులో పెద్దగా జాతీయ పండుగలు లేవు. భారతదేశంలోని చాలా నగరాల్లోని బ్యాంకులు 2, 4వ శనివారం, ఆదివారం మినహా ఈ నెలలో అన్ని రోజులు బ్యాంకులు పనిచేస్తాయి. ఆర్‌బిఐ మార్గదర్శకాల ప్రకారం భారతదేశంలోని బ్యాంకులు సాధారణంగా ప్రభుత్వ సెలవు దినాల్లో మూసివేయనుంది. 

అల్ ఇండియా బ్యాంక్ సెలవులలో రిపబ్లిక్ డే (జనవరి 26), స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్టు 15), గాంధీ జయంతి (అక్టోబర్ 2) ఉన్నాయి. దీపావళి, క్రిస్మస్, ఈద్, గురు నానక్ జయంతి, గుడ్ ఫ్రైడే, వంటి పండుగలు కూడా బ్యాంక్ సెలవులు. ఇంకా ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రతి నెల రెండవ, నాల్గవ శనివారం, అన్ని ఆదివారాలలో మూసివేయనుంది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) వెబ్‌సైట్ - rbi.org.in- ప్రకారం బక్రీద్ (ఐడి-ఉల్-జుహా), రక్షా బంధన్, శ్రీ కృష్ణ జన్మాష్టమి వంటి కొన్ని సెలవులను పాటించడానికి కొన్ని నగరాల్లోని బ్యాంకులు ఈ నెలలో మూసివేయనుంది. 

also read  వాహనదారులకు గుడ్ న్యూస్: డీజిల్ పై లీటర్‌కు రూ.8.36 తగ్గింపు.. ...  

ఈద్-ఉల్-జుహా, స్వాతంత్ర్య దినోత్సవం కారణంగా చాలా నగరాల్లోని బ్యాంకులు ఆగస్టు 1, ఆగస్టు 15న మూసివేయనుంది. రక్షా బంధన్ కారణంగా ఆగస్టు 3న అహ్మదాబాద్, డెహ్రాడూన్, జైపూర్, కాన్పూర్, లక్నోలో బ్యాంకులు మూసివేయనుంది. ఆగస్టు 11న శ్రీ కృష్ణ జన్మస్తమి సందర్భంగా భువనేశ్వర్, చెన్నై, హైదరాబాద్, పాట్నాలోని బ్యాంకులు పని చేయవు.

ఆగస్టు 12న అహ్మదాబాద్, భోపాల్, చండీఘడ్, డెహ్రాడూన్, జైపూర్, జమ్మూ కాశ్మీర్, కాన్పూర్, లక్నో, రాయ్ పూర్, రాంచీ, షిల్లాంగ్, సిమ్లా, శ్రీనగర్లలో శ్రీకిష్ణ జన్మాష్టమి కారణంగా బ్యాంకులు మూసివేయనుంది. దేశభక్తుల దినోత్సవం కోసం ఆగస్టు 13న ఇంఫాల్‌లోని బ్యాంకులు పనిచేయవు. గణేష్ చతుర్థి కారణంగా అహ్మదాబాద్, బేలాపూర్, చెన్నై, హైదరాబాద్, ముంబై, నాగ్ పూర్, పనాజీలలో బ్యాంకులు ఆగస్టు 22న మూతపడతాయి.