Asianet News TeluguAsianet News Telugu

ఎన్నికల సీజన్, విహారయాత్రలకు కుబేరుల ప్లాన్.. ఛార్టెర్డ్ ఫ్లైట్స్‌కి గిరాకీ

భారతదేశంలో విమానయాన రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉన్న సంగతి తెలిసిందే. అతి పెద్ద దేశం కావడంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతుండటం, దేశవ్యాప్తంగా విమానాశ్రయాలు అందుబాటులోకి వస్తుండటంతో ఏవియేషన్ పరిశ్రమ వచ్చే కొన్నేళ్లలో అద్భుతంగా అభివృద్ధి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు

high demand for chartered flights ksp
Author
new delhi, First Published Mar 28, 2021, 3:33 PM IST

భారతదేశంలో విమానయాన రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉన్న సంగతి తెలిసిందే. అతి పెద్ద దేశం కావడంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతుండటం, దేశవ్యాప్తంగా విమానాశ్రయాలు అందుబాటులోకి వస్తుండటంతో ఏవియేషన్ పరిశ్రమ వచ్చే కొన్నేళ్లలో అద్భుతంగా అభివృద్ధి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు.

కాగా ప్రైవేటు చార్టర్డ్‌ విమానాలు, హెలికాప్టర్లకు మళ్లీ గిరాకీ పెరుగుతోంది. 5 రాష్ట్రాలు, కరోనా కేసులు పెరుగుతుండటంతో సురక్షిత ప్రయాణానికి వీటిని బుక్‌ చేసుకుంటున్నారు. కొవిడ్‌ కారణంగా గతేడాది చార్టర్డ్‌ విమానాల బుకింగ్‌లు క్రితం ఏడాదితో పోలిస్తే 50 శాతం తగ్గాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

కరోనాకు ముందు కూడా చార్టర్డ్‌ విమానాల్లో ప్రయాణించిన వారు కొందరైతే.. ఇదివరకు బిజినెస్‌ క్లాస్‌లో ప్రయాణించిన సంపన్నుల్లోని కొందరు వైరస్ భయంతో ప్రైవేటు చార్టర్డ్‌ విమానాల వైపు మొగ్గుచూపుతున్నారు.

కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి వెళ్లేందుకు ఛార్టెర్డ్ విమానం బుక్‌ చేసుకుంటున్నారని క్లబ్‌ వన్‌ ఎయిర్‌ సంస్థ తెలిపింది. ఒక్కో విమానం కోవిడ్‌కు ముందు నెలలో 40- 50 గంటల పాటు ప్రయాణించేదని, ఇప్పుడు మళ్లీ ఆ స్థాయిలో కార్యకలాపాలు నడుస్తున్నాయని పేర్కొంది.  

ఎన్నికల ప్రచారానికి అనువుగా నేతలు హెలికాప్టర్లను బుక్ చేసుకుంటున్నారు. సాధారణంగా ఓఎన్‌జీసీ, రాష్ట్ర ప్రభుత్వాలు, మతపరమైన పర్యటనలకు హెలికాప్టర్లు ఎక్కువగా బుక్‌ అవుతుంటాయట, 

సాధారణంగా వేసవిలో కుటుంబంతో కలిసి పర్యటనలు ఎక్కువగా జరుపుతుంటారు. ఈ సందర్భంగా ప్రైవేటు విమానాల బుకింగ్‌ మే నెలలో ప్రారంభమై, అక్టోబరు వరకు కూడా కొనసాగుతుంటుంది.

ఇక వ్యాపార అవసరాల నిమిత్తం, పర్యటనలకు వెళ్లే సంపన్నులు కూడా వీటిని బుక్ చేసుకుంటారు. కొవిడ్‌ వల్ల ఏడాది పాటు ఇంటికి, కార్యాలయానికే పరిమితమైపోయిన కుబేరులు, కార్పోరేట్ ఎగ్జిక్యూటివ్‌లు సేద తీరేందుకు పర్యటనలకు శ్రీకారం చుట్టారు.

భారతదేశంలో హైదరాబాద్‌-ఢిల్లీ, హైదరాబాద్‌-ముంబయి , విజయవాడ-ఢిల్లీ, ముంబయి-ఢిల్లీ , కోల్‌కతా-అహ్మదాబాద్‌, ముంబయి-కోల్‌కతా  మార్గాల్లో ఛార్టెర్ట్ విమానాలకు మంచి గిరాకీ వుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios