సోదరి చేతిపై మెహందీ యూపీఐ కోడ్..వీడియో వైరల్...డిజిటల్ పేమెంట్స్ పరాకాష్ట అంటే ఇదే అంటున్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో ఒక మెహందీ వీడియో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు దీన్ని 'QR కోడ్ మెహందీ' అని పిలుస్తున్నారు, అసలు ఈ క్యూఆర్ కోడ్ మెహందీ కథేంటో తెలుసుకుందాం.
రాఖీ పండగ వచ్చిందంటే చాలు సోదరీమణులు తమ సోదరుడికి రాఖీ కట్టి కానుక పొందాలని చూస్తూ ఉంటారు. సాధారణంగా రాఖీ కట్టిన తర్వాత తమ సోదరికి నగదు రూపంలో బహుమతి ఇవ్వడం అనేది ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయం. ఈ సాంప్రదాయం దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఉంది. అయితే ప్రస్తుతం డిజిటల్ అకానమీ వచ్చినప్పటి నుంచి కొంతమంది తమ సోదరికి యూపీఐ పేమెంట్ ద్వారా నగదు కానుకలు అందిస్తున్నారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది అందులో సోదరి తన చేతి పైన యుపిఐ కోడ్ మెహందీ డిజైన్ గా పెట్టుకోగా రాఖీ కట్టిన అనంతరం ఆమె సోదరుడు ఆ యూపీఐ మెహందీ డిజైన్ కోడ్ స్కాన్ చేసి ఆమె అకౌంట్లో డబ్బులు వేయడం ఈ వీడియోలో కనిపిస్తోంది.
నిజానికి ఈ వీడియో సోషల్ మీడియాలో కొంతమంది సరదాగా వైరల్ చేస్తున్నారు. నిజంగా ఈ విధంగా చేయవచ్చా లేదా అన్నది నిర్ధారణ కాలేదు. ఎందుకంటే యూపీఐ కోడ్ అనేది పూర్తిస్థాయిలో సురక్షితమైన ఎన్క్రిప్టెడ్ కోడ్ దీనిని కేవలం ప్రింట్ అవుట్ ద్వారా మాత్రమే స్కాన్ చేయవచ్చు. ఈ విధంగా చేతి మీద మెహందీ వేసుకొని కోడ్ డిజైన్ చేయవచ్చా లేదా అన్నది ఇంకా ఎవరూ నిర్ధారించలేదు. అయితే సరదాగా వైరల్ అవుతున్న ఈ వీడియో భారత దేశంలో విస్తృతంగా వ్యాప్తి అవుతున్నటువంటి డిజిటల్ ఎకానమీకి అద్దం పడుతోందని కొంతమంది నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే మన దేశంలో ఇప్పటికే యూపీఐ ద్వారా చెల్లింపులు భారీగా పెరిగిపోయాయి. దాదాపు అన్ని రంగాల్లోనూ యూపీఐ ద్వారా చెల్లింపులు సాగుతున్నాయి.
సోషల్ మీడియాలో సరదాగా వైరల్ అవుతున్నటువంటి ఈ వీడియోను చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి అలాగే ఒకవేళ మీరు మీ సోదరికి నిజంగానే డిజిటల్ పద్ధతిలో కానుకలు ఇవ్వాలి అనుకుంటే యూపీఐ ద్వారా నగదు ట్రాన్స్ఫర్ చేయవచ్చు. అదేవిధంగా మీరు ఆన్లైన్లో వారి పేరిట బంగారం కూడా కొనుగోలు చేయవచ్చు తద్వారా వారి భవిష్యత్తుకు మంచి సోపానం అవుతుంది.