సెబీ దెబ్బతో IIFL సెక్యూరిటీస్ షేర్లలో భారీ అమ్మకాలు, ఇంట్రాడేలో 24 శాతం పతనం..అసలు విషయం ఏంటి..?
IIFL సెక్యూరిటీస్ , స్టాక్ బ్రోకింగ్ యూనిట్‌పై ప్రధాన చర్య తీసుకుంటూ, SEBI 2 సంవత్సరాల పాటు కొత్త క్లయింట్‌లను తీసుకోకుండా కంపెనీని నిషేధం విధించింది. దీంతో కంపెనీ షేర్లు దాదాపు 24 శాతం మేర పతనం అయ్యాయి. ఒకేరోజు ఈ స్థాయిలో పతనం కావడంతో మదుపర్లు ఆందోళనకు గురవుతున్నారు.
మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI)చర్యలు తీసుకున్న తర్వాత, బ్రోకరేజ్ వ్యాపారంతో IIFL సెక్యూరిటీల షేర్లు భారీగా పడిపోయాయి. నేటి ట్రేడింగ్‌లో ఐఐఎఫ్‌ఎల్ సెక్యూరిటీస్ షేర్ 24 శాతం క్షీణించి రూ.57.50కి చేరుకుంది. కాగా సోమవారం రూ.71.20 వద్ద ముగిసింది. IIFL సెక్యూరిటీస్ , స్టాక్ బ్రోకింగ్ యూనిట్‌పై SEBI 2 సంవత్సరాల పాటు కొత్త క్లయింట్‌లను తీసుకోకుండా కంపెనీని నిషేధించింది.
IIFL సెక్యూరిటీస్ షేర్లు సెప్టెంబర్ 2019లో స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో రూ. 22 ధరతో నమోదు అచేసింది. ఇది IIFL ఫైనాన్స్ నుండి వేరు చేసిన సంస్థ కావడం విశేషం. సోమవారం ఈ షేరు రూ.71 వద్ద ముగిసింది. ఈ నేపథ్యంలో నేడు జరిగిన పతనానికి ముందు 200 శాతానికి పైగా లాభం వచ్చింది.
ఎందుకు చర్యలు తీసుకున్నారు
రాయిటర్స్ వార్తా సంస్థ ప్రకారం, కస్టమర్ నిధుల దుర్వినియోగం ఆరోపణలపై IIFL సెక్యూరిటీస్‌పై ఈ చర్య తీసుకున్నారు. 2013-14 మధ్య కాలంలో కంపెనీ ఇలాంటి అవకతవకలకు పాల్పడిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. SEBI బోర్డు ఏప్రిల్ 2011 నుండి జనవరి 2017 వరకు IIFL సెక్యూరిటీస్ , కార్యకలాపాలు , అకౌంట్లపై విచారణ నిర్వహించింది. ఈ విచారణలో నిబంధనలను ఉల్లంఘించిన పలు ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. నిబంధనలను ఉల్లంఘించిన సందర్భాల్లో కంపెనీ నిధులతో కస్టమర్ ఫండ్‌లను కలపడం, ఒక కస్టమర్ ఖాతాలోని క్రెడిట్ బ్యాలెన్స్‌ను మరొక కస్టమర్‌కు బదిలీ చేయడం వంటి అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఈ విషయంపై చర్యలు తీసుకున్న సెబీ సోమవారం చర్యలకు దిగింది. .
మొత్తం విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత, IIFL సెక్యూరిటీస్ తప్పులను సరిదిద్దడానికి చర్యలు చేపట్టింది, అయితే ఉల్లంఘనల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, ఈ మేరకు జారీ చేసిన లేఖలో సెబీ పేర్కొంది. రెగ్యులేటర్ ఆర్డర్‌పై మేము అప్పీల్ చేస్తామని సెబీ ఆర్డర్ తర్వాత IIFL సెక్యూరిటీస్ అధికారి రాయిటర్స్‌తో అన్నారు. అయితే, మీడియాతో మాట్లాడేందుకు అనుమతించకపోవడంతో కంపెనీ అధికారులు అతని పేరును ఏజెన్సీకి వెల్లడించలేదు.