Asianet News TeluguAsianet News Telugu

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ లో కొత్తగా 14వేల మంది కరస్పాండెంట్ల నియామకం..

అక్కౌంట్ ఓపెన్ చేయడం, ఫిక్సెడ్ డిపాజిట్,  పేమెంట్‌ ప్రొడెక్ట్‌లు, లోన్‌ క్లోజింగ్‌ వంటివి గ్రామీణ ప్రాంతంలోని వారు ఇంటికి దగ్గరే బ్యాంకింగ్ సదుపాయాలను పొందవచ్చు. బ్యాంక్ బ్యాంకింగ్ కరస్పాండెంట్ల  నెట్‌వర్క్‌ను విస్తరించడానికి ప్రభుత్వ కామన్‌ సర్వీసు కేంద్రాలతో (సిఎస్‌సి) ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు పరిశీలిస్తోంది. 

HDFC Bank to increase number of banking correspondents to 25,000 by March
Author
Hyderabad, First Published Sep 12, 2020, 10:51 AM IST

న్యూ ఢీల్లీ: దేశంలోని అతిపెద్ద ప్రైవేటు రంగ రుణదాత హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ బ్యాంకింగ్ కరస్పాండెంట్లను (బిసి) 25 వేలకు రెట్టింపు చేయాలని యోచిస్తోంది. ప్రస్తుతం, బ్యాంకులో 11,000 బ్యాంకింగ్ కరస్పాండెంట్ల నెట్‌వర్క్ ఉంది.

"దేశంలోని మారుమూల ప్రాంతాలలో ఉన్న ప్రతి వినియోగదారునికి ఉత్తమమైన బ్యాంకింగ్ సదుపాయాన్ని కల్పించడానికి మేము ఎల్లప్పుడూ ప్రయత్నిస్తాము. మేము ఇప్పటివరకు 11,000 మంది బ్యాంకింగ్ కరస్పాండెంట్లను నియమించాము. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి కరస్పాండెంట్ల సంఖ్య 25,000కు పెంచాలని యోచిస్తున్నాము" అని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ కంట్రీ హెడ్ ప్రభుత్వ ఇన్స్టిట్యూషనల్ బిజినెస్  స్మితా భగత్ చెప్పారు.

అక్కౌంట్ ఓపెన్ చేయడం, ఫిక్సెడ్ డిపాజిట్,  పేమెంట్‌ ప్రొడెక్ట్‌లు, లోన్‌ క్లోజింగ్‌ వంటివి గ్రామీణ ప్రాంతంలోని వారు ఇంటికి దగ్గరే బ్యాంకింగ్ సదుపాయాలను పొందవచ్చు. బ్యాంక్ బ్యాంకింగ్ కరస్పాండెంట్ల  నెట్‌వర్క్‌ను విస్తరించడానికి ప్రభుత్వ కామన్‌ సర్వీసు కేంద్రాలతో (సిఎస్‌సి) ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు పరిశీలిస్తోంది.

also read ఇండిగో ఎయిర్ లైన్స్ కు డిజిసిఎ నోటీసులు.. కంగనా రనౌత్ కారణమా.. ? ...

దేశంలోని మారుమూల ప్రాంతాలకు విస్తరించే ప్రయత్నంలో భాగంగా బ్యాంక్ 2018లో సిఎస్సి ఇ-గవర్నెన్స్ ఆఫ్ ఇండియా ప్రభుత్వంతో చేతులు కలిపింది.

ఈ రెండింటి మధ్య ఒక ఒప్పందం దేశవ్యాప్తంగా ఆర్థిక సేవలకు చివరి మైలు. సిఎస్‌సితో సంబంధం ఉన్న గ్రామ స్థాయి పారిశ్రామికవేత్తల నుండి బ్యాంకింగ్ కరస్పాండెంట్లను బ్యాంక్ నియమిస్తుంది.

ఈ ఒప్పందం ప్రకారం బిజినెస్ కరస్పాండెంట్లు బిజినెస్ ఫెసిలిటేటర్ (బిఎఫ్) గా కూడా పని చేస్తారని, దీనివల్ల వ్యాపారులు, యువత, పారిశ్రామికవేత్తలు, రైతులు, మహిళలు బ్యాంకు నుంచి రుణ సౌకర్యం పొందగలుగుతారు.

దేశవ్యాప్తంగా సుమారు 3లక్షల సిఎస్‌సిలు ఉన్నాయి. జూన్ త్రైమాసికంలో బ్యాంక్ ఆదాయం రూ.34,453.28 కోట్లకు పెరిగింది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో రూ.32,361.84 కోట్లు.
 

Follow Us:
Download App:
  • android
  • ios