Asianet News TeluguAsianet News Telugu

HDFC Bank Hikes FD rates: ఎఫ్​డీ రేట్లను పెంచిన హెచ్‌డీఎఫ్‌సీ​.. కొత్త రేట్లు ఇవే..!

దేశంలో అతిపెద్ద ప్రైవేటు బ్యాంక్ అయిన హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ గుడ్​ న్యూస్ చెప్పింది. ఫిక్స్​డ్​ డిపాజిట్లపై (ఎఫ్​డీ) వడ్డీ రేట్లను పెంచినట్లు (HDFC Bank Hike interest rates on FDs) ప్రకటించింది.

HDFC Bank Hikes FD rates
Author
Hyderabad, First Published Jan 17, 2022, 1:25 PM IST

దేశంలో అతిపెద్ద ప్రైవేటు బ్యాంక్ అయిన హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ గుడ్​ న్యూస్ చెప్పింది. ఫిక్స్​డ్​ డిపాజిట్లపై (ఎఫ్​డీ) వడ్డీ రేట్లను పెంచినట్లు (HDFC Bank Hike interest rates on FDs) ప్రకటించింది. హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ వెబ్​సైట్ ప్రకారం.. రూ.2 కోట్ల లోపు డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెరిగినట్లు తెలిసింది. రెండేళ్లకన్నా ఎక్కువ మెచ్యూరిటీ పీరియడ్ ఉన్న ఎఫ్​డీలకు మాత్రమే పెరిగిన వడ్డీ రేట్లు వర్తిస్తాయని కూడా  (HDFC Bank new Interest rates)వెల్లడైంది.

పెరిగిన ఎఫ్​డీ రేటర్లు జనవరి 12 నుంచి అమలులో ఉంటాయని హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ పేర్కొంది. 2 ఏళ్ల నుంచి మూడేళ్ల వ్యధి ఉన్న ఎఫ్​డీపై 5.20 శాతం వడ్డీ రేటును ఇవ్వనుంది హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్. 3-5 ఏళ్ల మెచ్యూరిటీ పీరియడ్ ఉన్న ఎఫ్​డీలపై వడ్డీరేటను 5.40 శాతానికి పెంచింది. 5-10 ఏళ్ల వరకు వ్యవధి ఉన్న ఫిక్స్​డ్​ డిపాజిట్లపై వడ్డీ రేటును ఏకంగా 5.60 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్.

రెండేళ్లకన్నా తక్కువ వ్యవధి ఉన్న ఎఫ్​డీలపై వడ్డీ రేట్లు ఈ విధంగా ఉన్నాయి.

7-14 రోజుల వ్యవధి ఉండే ఎఫ్​డీపై వడ్డీ రేటు 2.50 శాతంగా ఉంది.
15-29 రోజుల పీరియడ్ గల ఎఫ్​డీలకు 2.50 శాతం వడ్డీ లభిస్తోంది.
30-45 రోజుల వ్యవధి ఉన్న ఫిక్స్​డ్ డిపాజిట్ల వడ్డీ రేటు 3 శాతం.
61-90 రోజుల కాల పరిమితి ఉన్న ఎఫ్​డీపై వడ్డీ రేటు 3 శాతంగా ఉంది.
91 రోజుల నుంచి 6 నెలల వ్యవధితో కూడిన ఎఫ్​డీకి వడ్డీ రేటును 3.5 శాతంగా నిర్ణయించింది బ్యాంక్.
6 నెలల 1 రోజు నుంచి 9 నెలల వరకు వ్యవధి ఉన్న ఎఫ్​డీపై వడ్డీ రేటు 4.4 శాతం.
9 నెలల 1 రోజు నుంచి ఏడాదిలోపు ఫిక్స్​డ్​ డిపాజిట్లపై కూడా వడ్డీ రేటు 4.4 శాతం.
ఏడాది నుంచి రెండేళ్ల వరకు వ్యవధి ఉన్న ఎఫ్​డీపై వడ్డీ రేటు 5 శాతంగా నిర్ణయించింది హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​.​

Follow Us:
Download App:
  • android
  • ios