ముంబై: హెచ్ డి ఎఫ్ సి బ్యాంకుకు సంబంధించిన ఆన్ లైన్ సేవలు నిలిచిపోయి దాదాపుగా 24 గంటలు దాటింది. ట్విట్టర్లో ఏకంగా  హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు డౌన్ అని ఒక హాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుందంటే, ఎంతమంది కస్టమర్లు ఈ పరిస్థితివల్ల ఎంతలా ఇబ్బందులు పడుతున్నారో మనకు అర్థమవుతుంది. 

సోషల్ మీడియాలో కొందరు తమ బాధలను కోపంగా వెలిబుచ్చుతుంటే, కొందరేమో జోకులు పేలుస్తున్నారు. వీరు తమకు ఎదురైనా అనుభవాల్ని ఇలా హాస్యోక్తంగా చెబుతుండడంతో ట్విట్టర్ వేదికపై నవ్వులు పూయిస్తుంది. చాలా మంది తమ సృజనాత్మకతకు పదును పెడుతున్నారు. 

ప్రముఖ స్టాక్ అనలిస్ట్ అనుపమ్ గుప్త వరుస ట్వీట్లలో జోకులు పేల్చారు. తొలుత  హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు పని చేయకపోవడంపై ప్రధాని నరేంద్ర మోడీకి లంకె పెట్టి జోకు పేల్చారు. 2016లో పెద్ద నోట్లను ఎలా అయితే బ్యాంకు రద్దు చేసిందో, ఇలా 2019 డిసెంబర్ 31 తరువాత బ్యాంకు అకౌంట్లన్నింటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోబోతుందని,  హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు ఇలా పనిచేయకపోవడం రాబోయే పరిణామానికి సూచన అని ఫన్నీ గా ట్వీట్ చేసాడు. 

 

మరో ట్వీట్లో ఒక వేళ నేను క్రెడిట్ కార్డు బిల్ కట్టడం ఆలస్యమైతే, దానిపైన  హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు ఫైన్ వేయదు అని అనుకుంటున్నాను అని అన్నాడు. 

 ఇక మరో పేరడీ అకౌంట్ విజయ్ మాల్యా నుంచి ఒక ఫన్నీ ట్వీట్ చేసారు. నా 9000 కోట్ల అప్పును తిరిగి కడుదామని ఎంత ప్రయత్నించినా అవడం లేదని, హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు సైట్ డౌన్ అయ్యిందని పేర్కొన్నారు.