ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్‌డిఎఫ్‌సి మేనేజింగ్ డైరెక్టర్ (ఎండి) ఆదిత్య పూరి 95 శాతం వాటాను బ్యాంకులో 842.7 కోట్ల రూపాయలకు విక్రయించారు. దీంతో ఆదిత్య పూరి షేర్ వాల్యూ 0.14 శాతం నుంచి 0.01 శాతానికి తగ్గింది.

జూలై 21 నుండి జూలై 23 మధ్యలో ఈ 7.42 మిలియన్ షేర్లను విక్రయించాడు. భారతదేశంలో ఒక ప్రైవేట్ బ్యాంకులో ఎక్కువ కాలం పనిచేసిన ఎండిగా ఆదిత్య పూరి కొనసాగారు.

also read కేవలం గంటలోనే కరోనా సోకిందా లేదో తెలుసుకోవచ్చు.. ఎలా అంటే ! ...

1994లో హెచ్‌డి‌ఎఫ్‌సి బ్యాంక్ ప్రారంభమైనప్పటి నుండి గత 26 సంవత్సరాలుగా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఎండిగా సేవలందించారు. ఆదిత్య పూరి ఈ అక్టోబర్‌లో ఒక ప్రైవేట్ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌కు గరిష్ట వయోపరిమితి 70కి చేరుకుంటాడు.

అతను 2019-20లో వార్షిక జీతం 18.92 కోట్ల రూపాయలు అందుకున్నాడు, ఇది అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 38 శాతం ఎక్కువ, అగ్ర ప్రైవేటు బ్యాంకులలో అత్యధిక పారితోషికం పొందిన బ్యాంకర్ అవతరించాడు.  

ఆయన కృషితోనే హెచ్‌డి‌ఎఫ్‌సి బ్యాంకు‌ ఓ బలమైన శక్తిగా ఆవిర్భవించింది. అయితే, ఈ అక్టోబర్‌లో ఆదిత్య‌పురి తన  పదవి నుంచి వైదొలగనున్నారు.