Asianet News TeluguAsianet News Telugu

హెచ్1బీ వీసాల్లో మార్పులు : వచ్చేనెల నుంచే అమలు!

ప్రతియేటా ఐటీ, ఇతర నిపుణులకు అమెరికా జారీ చేసే హెచ్1 బీ వీసా కోసం అప్లికేషన్ల ప్రక్రియలో మార్పులు వచ్చేనెల నుంచి అమలులోకి రానున్నాయి. ముందుగా కంపెనీలు ఒక్కో అభ్యర్థి కోసం 10 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. 

H-1B visa application rules to change from next month. 5 things to know
Author
Hyderabad, First Published Mar 8, 2020, 1:07 PM IST

న్యూఢిల్లీ: ఐటీ సంస్థల్లో పని చేసే నిపుణుల కోసం అమెరికా ప్రతి యేటా జారీ చేసే హెచ్‌-1బీ వీసాల్లో చేసిన మార్పులు వచ్చేనెల నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ వీసాల జారీ, అప్లికేషన్ల ఆన్‌లైన్‌ ప్రాసెస్‌ ప్రారంభించనుంది. అప్లికేషన్లను కూడా వచ్చే నెల నుంచి స్వీకరిస్తారు. 

తొలుత కంపెనీలు ఆన్‌లైన్‌ విధానంలో హెచ్1 బీ వీసాల కోసం దరఖాస్తు చేసుకోవాలి.  తర్వాత వీసా ఫీజు కింద ప్రతి అప్లికేషన్‌కు 10 డాలర్లను చెల్లించాలి. కొత్త విధానం ప్రస్తుతం ఉన్న లాటరీ విధానంలో చాలా మార్పులు తీసుకురానున్నది. అమెరికా సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ ఏటా 85వేల హెచ్‌-1బీ వీసాలను జారీ చేస్తోంది. 

also read ఇక మనోళ్లకు హెచ్1-బీ వీసా కస్టమే....ఎందుకంటే..?

వీటిల్లో అత్యధికంగా భారతీయులు పొందుతుండగా.. వారిలో కూడా 70శాతం ఐటీ ఉద్యోగులకే లభిస్తున్నాయి. హెచ్‌-1బీ వీసా ఎలక్ట్రానిక్‌ రిజిస్ట్రేషన్‌ ప్రాసెస్‌ మార్చి ఒకటో తేదీన మొదలై మార్చి 20వ తేదీ వరకు కొనసాగుతుంది.

కంపెనీలు ప్రతి అభ్యర్థి కోసం 10 డాలర్లు చెల్లించాలి. కొత్త విధానంలో సమాచార సేకరణ, పేపర్‌ వర్క్‌ను కుదించడంతో పాటు యాజమాన్యాలకు మొత్తం మీద అయ్యే వ్యయాలను కూడా తగ్గిస్తుంది. 

ఈ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో ఉద్యోగి, యజమానికి సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని మాత్రమే అడుగుతారు. లబ్ధిదారు పూర్తిపేరు, పుట్టిన తేదీ వివరాలు, దేశం, పౌరసత్వం, లింగ సమాచారం, పాస్‌పోర్టు నంబర్‌ వంటి వాటితోపాటు జాబ్‌ ఆఫర్‌ లెటర్‌నూ వారికి సమర్పించాల్సి ఉంటుంది. 

హెచ్‌-1బీ వీసాలు రిజిస్ట్రేషన్‌ సమయంలో యాదృచ్చికంగా పరిశీలిస్తారు. ఆ తర్వాత ఎంపికైన వారికి యూఎస్‌సీఐఎస్‌ విషయం వెల్లడించిన మూడు నెలల్లోపు హెచ్‌-1బీ వీసాకు పిటిషన్‌ పెట్టుకోవాలని సూచిస్తారు. ఈ పిటిషన్లను వచ్చేనెల ఒకటో తేదీ నుంచి దాఖలు చేయవచ్చు. 

also read ఇండియన్స్ కి ట్రంప్ షాక్ : ఐటీ మేజర్లపై....

దీంతో ఎంపిక అయిన వారు మాత్రమే పిటిషన్‌ దాఖలు చేస్తుండటంతో చాలా ఖర్చు, శ్రమ మిగులుతున్నాయని యూఎస్‌సీఐఎస్‌ డిప్యూటీ డైరెక్టర్‌ మార్క్‌ కౌమన్స్‌ అన్నారు.

అమెరికా ప్రస్తుతం 65,000 హెచ్‌-1బీ వీసాలు మాత్రమే జారీ చేస్తున్నది. దీనికి అదనంగా అమెరికాలో ఉన్నత విద్య (మాస్టర్స్‌ డిగ్రీ, అంతకంటే ఎక్కువ స్థాయి విద్య) పూర్తి చేసిన మరో 20వేల మంది విదేశీ వృత్తినిపుణులకు జారీ చేస్తున్నది.

హెచ్‌-1బీ వీసాలు అత్యధికంగా పొందే తొలి 30 కంపెనీల్లో అత్యధికంగా ఐటీ రంగానికి చెందినవే ఉన్నాయి. 2018లో 66శాతం ఈ వీసాలు కంప్యూటర్‌ సంబంధ ఉద్యోగాలు చేసేవారికే లభించాయని హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ విభాగ రికార్డులు తెలియజేస్తున్నాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios