సారాంశం
ఏప్రిల్‌లో జిఎస్‌టి వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 12 శాతం పెరిగి రూ.1.87 లక్షల కోట్లకు చేరుకుంది. ఒక నెలలో వసూలైన అత్యధిక జీఎస్టీ ఆదాయం ఇదే. జులై, 2017లో జిఎస్‌టి విధానం అమలులోకి వచ్చినప్పటి నుండి అత్యధిక పన్ను వసూళ్లు గత ఏడాది ఏప్రిల్‌లో రూ. 1.68 లక్షల కోట్లుగా ఉంది.
ఏప్రిల్ 2023లో GST వసూళ్లు రూ. 1.87 లక్షల కోట్లుగా నమోదై సరికొత్త రికార్డును సృష్టించాయి. జీఎస్టీ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు వసూలైన జీఎస్టీ మంత్లీ వసూళ్లలో ఇదే అత్యధికం కావడం విశేషం. ఈ సమాచారాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గణాంకాల ప్రకారం, ఏప్రిల్ నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1.87 లక్షల కోట్లుగా వసూలయ్యాయి. అయితే అంతకుముందు మార్చి 2023లో దేశ జీఎస్టీ వసూళ్లు రూ.1,60,122 కోట్లుగా నమోదు అయ్యాయి ఏప్రిల్ 2022లో GST వసూళ్లు గత సంవత్సరంలో రూ. 1,67,540 కోట్లు, అంటే ఈ ఏడాది ఏప్రిల్‌లో GST వసూళ్లు ఏడాది క్రితంతో పోలిస్తే రూ.19,495 కోట్లు పెరిగాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది జీఎస్టీ వసూళ్లు 12 శాతం పెరిగాయి.
ఈ సంవత్సరం పరిస్థితి
ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, గత నెలలో మొత్తం జీఎస్టీ వసూళ్లు రూ.1,87,035 కోట్లుగా ఉన్నాయి. ఇందులో సెంట్రల్ జీఎస్టీ (సీజీఎస్టీ) వాటా రూ.38,440 కోట్లు. అదనంగా రాష్ట్ర జీఎస్టీ (ఎస్జీఎస్టీ) రూ.47,412 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (ఐజీఎస్టీ) రూ.89,158 కోట్లు, సెస్ రూ.12,025 కోట్లు అందించింది. వస్తువుల దిగుమతుల ద్వారా సేకరించిన రూ.34,972 కోట్లు కూడా ఐజీఎస్టీలో ఉన్నాయి. అత్యధిక GST సేకరణ 20 ఏప్రిల్ 2023న జరిగింది
ఆర్థిక మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, 20 ఏప్రిల్ 2023న ఒకే రోజులో అత్యధిక GST వసూళ్లు జరిగాయి. తద్వారా 9.8 లక్షల లావాదేవీల ద్వారా రూ.68,228 కోట్ల వసూళ్లు జరిగాయి.
మెరుగైన అంతర్జాతీయ విక్రయాలు, కొత్త ఆర్డర్‌లు, సప్లై చెయిన్ పరిస్థితులు మెరుగుపడటం వంటి కారణాలతో ఏప్రిల్ 2023లో దేశం , తయారీ రంగ కార్యకలాపాలు నాలుగు నెలల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. సోమవారం విడుదల చేసిన కాలానుగుణంగా సర్దుబాటు చేయబడిన S&P గ్లోబల్ ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజ్‌మెంట్ ఇండెక్స్ (PMI) ఏప్రిల్‌లో 57.2కి పెరిగింది. ఇది మార్చి 2023లో 56.4గా ఉంది. PMI డేటా మొత్తం ఆపరేటింగ్ పరిస్థితులు వరుసగా 22వ నెలలో మెరుగుపడినట్లు చూపించింది.