Asianet News TeluguAsianet News Telugu

ప్రారంభమైన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం.. వైద్యపరికరాలు, మందులపై పన్ను తగ్గింపు ఊరట లభించనుందా..!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆధ్వర్యంలో 44వ జీఎస్టీ మండలి సమావేశం ప్రారంభమైంది.  వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరుగుతున్న ఈ సమావేశంలో  అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు  పాల్గొంటున్నారు. 
 

gst council meeting june 2021 today finance minister nirmala sitharaman update covid medicines tax reduction
Author
Hyderabad, First Published Jun 12, 2021, 1:40 PM IST

 జి‌ఎస్‌టి కౌన్సిల్ 44వ సమావేశం నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ప్రారంభమైంది. ఇందులో కోవిడ్‌-19కు సంబంధించిన ముఖ్యమైన వస్తువులపై జి‌ఎస్‌టి ధరలు తగ్గించడంపై నిర్ణయం తీసుకొనున్నారు. ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి అనురాగ్ ఠాకూర్, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.

మే 28న జరిగిన చివరి  జి‌ఎస్‌టి కౌన్సిల్ సమావేశంలో పిపిఇ కిట్లు, మస్కూలు, వ్యాక్సిన్లతో సహా కోవిడ్-19కి సంబంధించిన ముఖ్యమైన వస్తువులపై పన్ను ఉపశమనం కల్పించడానికి ఒక మంత్రుల బృందాన్ని (గోమ్) ఏర్పాటు చేసింది. జూన్ 7న ఈ బృందం తన నివేదికను సమర్పించింది. 

also read ఎల్‌ఐ‌సి కస్టమర్లకు అలర్ట్.. అనుమతి లేకుండా అలా చేస్తే కఠిన చర్యలు తప్పవు.. ...

అవసరమైన వస్తువులపై ధరల తగ్గింపుకు అనుకూలంగా కొన్ని రాష్ట్రాలు

ఈ సమావేశంలో మంత్రుల బృందం సమర్పించిన నివేదికను పరిశీలిస్తారు. కొన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు కోవిడ్‌-19కు సంబంధించిన ముఖ్యమైన వస్తువులపై ధరలు తగ్గించాలని సూచించినట్లు భావిస్తున్నారు.

రోగుల సౌలభ్యం కోసం కోవిడ్‌-19కు సంబంధించిన నిత్యావసర వస్తువులపై పన్ను తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుకూలంగా ఉందని ఉత్తర ప్రదేశ్ ఆర్థిక మంత్రి సురేష్ కుమార్ ఖన్నా అన్నారు. అయితే వస్తు, సేవల పన్ను (జీఎస్‌టి) ధరలకు సంబంధించి జీఎస్‌టి కౌన్సిల్ నిర్ణయాన్ని అంగీకరిస్తుంది.

 కోవిడ్ -19 సెకండ్ వేవ్ కారణంగా జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఆర్థిక కార్యకలాపాలను ప్రభావితం చేసింది  . ద్రవ్యోల్బణం భారం కూడా ప్రజలపై పెరిగింది. ఇలాంటి పరిస్థితిలో ఆర్థిక మంత్రి నేతృత్వంలోని ఈ సంవత్సరం రెండవ సమావేశం చాలా ముఖ్యమైనది. ఇందులో కోవిడ్-19 మహమ్మారికి సంబంధించిన ఔషధాలు, టీకాలు, వైద్య పరికరాలపై పన్ను ధరలను తగ్గించే నిర్ణయం తీసుకోనుంది.

Follow Us:
Download App:
  • android
  • ios