Asianet News TeluguAsianet News Telugu

ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలులో ఫైనాన్స్ సేవల కోసం.. BYD ఇండియా, బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ మధ్య కీలక ఒప్పందం..

BYD ఇండియా, బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ తో ఈ రోజు అవగాహన ఒప్పందం కుదరింది. దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ (EV) కొనుగోళ్లను ప్రోత్సహించడం సహా కస్టమర్లకు  ఫైనాన్సింగ్ సౌకర్యం అందించేందుకు ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు.

greement between BYD India and Bajaj Finance Limited for finance services in the purchase of electric vehicles MKA
Author
First Published Jun 28, 2023, 3:36 PM IST

BYD ఇండియా, బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ తో ఈ రోజు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నది. దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ (EV) కొనుగోళ్లను ప్రోత్సహించడం కోసం అలాగే BYD డీలర్లు, అలాగే కస్టమర్ల కోసం ఫైనాన్సింగ్ పరిష్కారాలను అందించేందుకు ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా  BYD ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ గోపాలకృష్ణన్,   బజాజ్ ఫైనాన్స్ ప్రెసిడెంట్ సిధాంత్ దద్వాల్ మధ్య ఒప్పందం (MoU)పై సంతకాలు చేశారు.

ఈ సందర్భంగా BYD ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ గోపాలకృష్ణన్ మాట్లాడుతూ, “బజాజ్ ఫైనాన్స్‌తో మా భాగస్వామ్యం BYD ఇండియాకు  ముఖ్యమైన మైలురాయి అని పేర్కొన్నారు.  బజాజ్ ఫైనాన్స్‌ భాగస్వామ్యంతో కస్టమర్‌లు, డీలర్‌లకు సులభంగా ఫైనాన్స్  పరిష్కారాలు అందుబాటులోకి తీసుకురావడమే ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశ్యమన్నారు. బజాజ్ ఫైనాన్స్ ఆటో ప్రెసిడెంట్ సిధాంత్ దద్వాల్ మాట్లాడుతూ ఇటీవలి సంవత్సరాలలో ఎలక్ట్రిక్ వాహనాలు జనాదరణ పొందుతున్నాయి. ముఖ్యంగా BYD EV మార్కెటులో ప్రధాన కీలక పాత్ర పోషిస్తోంది. ఆటో ఫైనాన్సింగ్ మార్కెట్ లో కస్టమర్‌లు ఎలాంటి అవాంతరాలు లేని క్రెడిట్ యాక్సెస్‌ను ఆశిస్తున్నారు.  BYD ఇండియాతో కలిసి, అన్ని రకాల పైనాన్స్ సేవాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. బజాజ్ ఫైనాన్స్ భారతీయ EV ఫైనాన్సింగ్ మార్కెట్ విభాగంలో తన పోర్ట్‌ఫోలియోను విస్తరించడానికి ఈ ఒప్పందం దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.  

BYD ఇండియా భారతదేశంలోని చెన్నైలో మార్చి 2007లో  స్థాపించగా, భారతీయ అనుబంధ సంస్థ 140,000 sqm కంటే ఎక్కువ విస్తీర్ణంలో రెండు కర్మాగారాలను కలిగి ఉంది, సుమారు 200 మిలియన్ డాలర్ల పెట్టుబడితో ఈ పరిశ్రమను స్థాపించారు. ఈ వ్యాపారం ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్లు ఎలక్ట్రిక్ బస్సులు, ఎలక్ట్రిక్ ట్రక్కులు, ఎలక్ట్రిక్ ఫోర్క్‌లిఫ్ట్‌లు, ఎలక్ట్రానిక్స్ మరియు విడి భాగాలను కవర్ చేస్తుంది. BYD భారతదేశంలో వినియోగదారులకు ఉత్పత్తి పరిష్కారాలు మరియు సంబంధిత అమ్మకాల  సేవలను అందిస్తుంది.

Follow Us:
Download App:
  • android
  • ios