హైదరాబాద్, జనవరి 13, 2021:  మెట్‌ఫార్మిన్ హైడ్రోక్లోరైడ్ ఇఆర్ టాబ్లెట్స్ యుఎస్‌పి, 500 మి.గ్రా మరియు 1000 మి.గ్రా కోసం అబ్రివెటెడ్ న్యూ డ్రగ్ అప్లికేషన్ (ఏ‌ఎన్‌డి‌ఏ) తుది ఆమోదాన్ని యుఎస్ ఫుడ్ & డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యుఎస్ ఎఫ్‌డి‌ఏ) మంజూరును గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ నేడు ప్రకటించింది.  

గ్లూమెట్జా ఇఆర్ టాబ్లెట్స్, 500 మి.గ్రా అండ్ 1000 మి.గ్రా బాష్ హెల్త్ యుఎస్ ఎల్ఎల్సి (బాష్)  జెనరిక్ సమానమైన మెట్‌ఫార్మిన్ హైడ్రోక్లోరైడ్ ఇఆర్ టాబ్లెట్స్  టైప్ 2 డయాబెటిస్ మెల్లిటస్ ఉన్న పెద్దవారిలో గ్లైసెమిక్ కంట్రోల్ మెరుగుపరచడానికి మెట్‌ఫార్మిన్ హైడ్రోక్లోరైడ్ ఈ‌ఆర్ టాబ్లెట్లు ఆహారం, వ్యాయామానికి అనుబంధంగా సూచిస్తారు.

also read టెస్లా సి‌ఈ‌ఓ ఒక్క ట్వీట్ తో బోల్తాపడ్డ ఇన్వెస్టర్లు.. కానీ కంపెనీకి మాత్రం భారీగా పెరిగిన లాభాలు.. ...

మెట్‌ఫార్మిన్ హైడ్రోక్లోరైడ్ ఈ‌ఆర్ టాబ్లెట్స్‌ ఐ‌క్యూ‌వి‌ఐ‌ఏ హెల్త్ ప్రకారం నవంబర్ 2020తో ముగిసిన ఇటీవలి 12 నెలల్లో యు.ఎస్. అమ్మకాలు సుమారు 192 మిలియన్లు.

గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ ఇప్పుడు యుఎస్ ఎఫ్‌డి‌ఏ నుండి మొత్తం 35 ఏ‌ఎన్‌డి‌ఏ ఆమోదాలను పొందింది. ఇందులో 34 తుది ఆమోదాలు , 1 తాత్కాలిక ఆమోదం ఉన్నాయి. గ్లూమెట్జా అనేది సాలిక్స్ ఫార్మాస్యూటికల్స్. ఇంక్ ట్రేడ్మార్క్ లేదా దాని అనుబంధ సంస్థ.