Asianet News TeluguAsianet News Telugu

వావ్ గుడ్ న్యూస్.. ఇకపై స్విగ్గీ ద్వారా స్ట్రీట్‌ ఫుడ్‌ డోర్ డెలివరీ..

చిరు వీధి వ్యాపారాలను ఆన్‌లైన్‌లోకి తీసుకురావడానికి ఫుడ్ అగ్రిగేటర్ స్విగ్గీతో కేంద్రం చేతులు కలిపింది. ఇక ఢీల్లీ, అహ్మదాబాద్, చెన్నై, ఇండోర్, వారణాసి ప్రజలు చిరు స్ట్రీట్ ఫుడ్ వ్యాపారుల నుండి ఇంటి వద్దకె ఆహారాన్ని డెలివరీ పొందవచ్చు. కేంద్ర హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మినిస్ట్రీ ప్రకారం మొదట ఈ ఐదు నగరాల్లో 250 మంది స్ట్రీట్ ఫుడ్ విక్రేతలను ఆన్-బోర్డింగ్ ద్వారా పైలట్  ప్రాతిపదికన ప్రారంభించారు.

Govt and Swiggy to take businesses of street food vendors online in india
Author
Hyderabad, First Published Oct 6, 2020, 11:52 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

న్యూఢిల్లీ: చాలా మందికి స్ట్రీట్‌ ఫుడ్‌ అంటే చాలా ఇష్టం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వ్యాప్తి కారణంగా బయటికి వెళ్లాలంటే ఆలోచిస్తున్నరు. అందులో వారికి ఇష్టమైన  స్ట్రీట్‌ ఫుడ్‌  తినాలనే కోరిక అలానే ఉండిపోతుంది. అయితే త్వరలోనే వారి ఇంటి వద్దనే స్ట్రీట్‌ ఫుడ్‌ రుచి చూసే అవకాశం రానుంది. చిరు వీధి వ్యాపారాలను ఆన్‌లైన్‌లోకి తీసుకురావడానికి ఫుడ్ అగ్రిగేటర్ స్విగ్గీతో కేంద్రం చేతులు కలిపింది.

ఇక ఢీల్లీ, అహ్మదాబాద్, చెన్నై, ఇండోర్, వారణాసి ప్రజలు చిరు స్ట్రీట్ ఫుడ్ వ్యాపారుల నుండి ఇంటి వద్దకె ఆహారాన్ని డెలివరీ పొందవచ్చు. కేంద్ర హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మినిస్ట్రీ ప్రకారం మొదట ఈ ఐదు నగరాల్లో 250 మంది స్ట్రీట్ ఫుడ్ విక్రేతలను ఆన్-బోర్డింగ్ ద్వారా పైలట్  ప్రాతిపదికన ప్రారంభించారు, తరువాత దీనిని దేశంలోని ఇతర ప్రాంతాలలో అందుబాటులోకి తీసుకురానున్నారు.

ప్రధానమంత్రి స్ట్రీట్ ఆత్మభైభర్ నిధి పథకం కింద వీధి వ్యాపారుల నుండి వేలాది మంది వినియోగదారులకు ఆన్‌లైన్ సదుపాయాన్ని కల్పిస్తుందని అలాగే వారి వ్యాపారాలను అధివృద్ది చేసుకోవడానికి సహాయపడుతుందని కేంద్ర మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు. వీధి వర్తకులు, వేలాది మంది వినియోగదారులను ఆన్‌లైన్‌లో చేరడానికి ఈ పథకాన్ని ‘ప్రైమ్‌ మినిస్టర్‌ స్ట్రీట్‌ వెండర్స్‌ ఆత్మ నిర్భర్‌నిధి’ కిందకు తీసుకువస్తున్నట్లు ఆ శాఖ తెలిపింది.

also read రేషన్ కార్డుతో లభించే ఉపయోగాలు, ప్రయోజనాలు ఎంటో తెలుసా..? ...

ఇందుకోసం అవసరమైన ముందస్తు చర్యలు పూర్తయ్యేలా చూడడానికి మునిసిపల్ కార్పొరేషన్లు, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఐఐ), స్విగ్గీ, జిఎస్‌టి అధికారులతో సహా కీలకమైన వాటాదారులతో ఎం‌ఓ‌హెచ్‌యూ‌ఏ సమన్వయం చేసుకుందని అధికారి తెలిపారు. యూనియన్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ (హెచ్‌యుఎ) కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా సమక్షంలో వెబినార్ ద్వారా జాయింట్ సెక్రటరీ సంజయ్ కుమార్, స్విగ్గి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రాహుల్ బోత్రా ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు.

వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా అహ్మదాబాద్, చెన్నై, ఢీల్ల్లీ, ఇండోర్, వారణాసి మునిసిపల్ కమిషనర్లు కూడా ఇందులో పాల్గొన్నారని కేంద్ర మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఎం‌ఓ‌హెచ్‌యూ‌ఏ, స్విగ్గీ అహ్మదాబాద్, చెన్నై, ఢీల్లీ, ఇండోర్, వారణాసి అనే ఐదు నగరాల్లో 250 మంది విక్రేతలను ఆన్-బోర్డింగ్ ద్వారా పైలట్ ప్రోగ్రాం నడుపుతుంది.

"వీధి వ్యాపారుల విక్రేతలకు పాన్, ఎఫ్ఎస్ఎస్ఐఐ రిజిస్ట్రేషన్, టెక్నాలజీ /యాప్ వాడకంపై శిక్షణ, మెనూ డిజిటలైజేషన్, ధరలు, పరిశుభ్రత, ప్యాకేజింగ్ వంటివి ఉత్తమ పద్ధతులతో సహాయం చేయబడుతుంది" అని తెలిపింది.పైలట్ విజయవంతంగా పూర్తయిన తరువాత కేంద్ర మంత్రిత్వ శాఖ, స్విగ్గీ రెండు కలిసి ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా దశలవారీగా విస్తరించాలని యోచిస్తోంది.

వీధి వ్యాపారాల విక్రేతలను డిజిటల్ టెక్నాలజీతో శక్తివంతం చేయడానికి, స్విగ్గీ వంటి ప్రసిద్ధ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌తో చేతులు కలపడం ద్వారా వారికి ఎక్కువ ఆదాయాన్ని సంపాదించే అవకాశాలను సులభతరం చేయడానికి ఎం‌ఓ‌హెచ్‌యూ‌ఏ చేసిన మరో చర్యగా ఈ భాగస్వామ్యం కనిపిస్తుంది.

పి‌ఎం ఎస్‌వి‌ఏ నిధి స్కీం కింద స్ట్రీట్ ఫుడ్ విక్రేతలు రూ.10వేల వరకు వర్కింగ్ క్యాపిటల్ లోన్ పొందవచ్చు, ఇది ఒక సంవత్సరంలోపు నెలవారీ వాయిదాలలో తిరిగి చెల్లించవచ్చు.

ఎం‌ఓ‌హెచ్‌యూ‌ఏ అమలుచేస్తున్న ఈ పథకం 24 మార్చి 2020  లేదా అంతకు ముందు ఉన్న 50 లక్షల మంది స్ట్రీట్ ఫుడ్ విక్రేతలకు, పరిసర ప్రాంతాలలోని లేదా గ్రామీణ ప్రాంతాలతో సహా పట్టణ ప్రాంతాల్లో ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios