సెబీ ఛైర్మన్‌గా అజయ్ త్యాగి పదవీకాలం 2022 ఫిబ్రవరి వరకు అంటే మరో 18 నెలల వరకు ప్రభుత్వం పొడిగించింది. సెప్టెంబర్ 1 నుండి ఫిబ్రవరి 28 2022 వరకు అజయ్ త్యాగి ఛైర్మన్‌ పదవీకాలాన్ని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా మరో 18 నెలల పాటు పొడిగించాలని కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదించింది.

గతంలో ఫిబ్రవరి 2020లో అజయ్ త్యాగి పదవీకాలం మరో ఆరు నెలలు అంటే ఆగష్టు వరకు పొడిగించబడింది. అజయ్ త్యాగిని 10 ఫిబ్రవరి, 2017న యు కె సిన్హా స్థానంలో మార్కెట్ రెగ్యులేటర్ ఛైర్మన్‌గా నియతులయ్యారు. 1 మార్చి, 2017న చైర్మన్ కార్యాలయా బాధ్యతలు స్వీకరించారు.

అజయ్ త్యాగి హిమాచల్ ప్రదేశ్ కేడర్ 1984 బ్యాచ్ ఐఎఎస్ అధికారి. అతను ఉత్తర ప్రదేశ్ నుండి వచ్చాడు, అజయ్ త్యాగి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎకనామిక్స్, హార్వర్డ్ యూనివర్సిటీ నుండి మాస్టర్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, మాస్టర్ ఇన్ టెక్నాలజీ (కంప్యూటర్ సైన్స్) పూర్తి చేసాడు.

also read వరల్డ్ టాప్‌-2 బ్రాండ్‌గా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌.. మొదటి స్థానంలో ఆపిల్.. ...

కోవిడ్ -19 మహమ్మారి వల్ల కలిగే అనిశ్చితి దృష్ట్యా అతని పదవి కాలం పొడిగింపు కీలకం అని మార్కెట్ పరిశీలకులు అంటున్నారు. సెబి ప్రధాన కార్యాలయం ఉన్న ముంబైలో కఠినమైన లాక్ డౌన్ ఉన్నప్పటికీ అజయ్  త్యాగి కరోనా వైరస్ మహమ్మారి సమయంలో కూడా తన సేవలను అందించినట్లు  తెలుస్తుంది.

గత నెలలో అజయ్  త్యాగి తరువాతా ఛైర్మన్ పదవి కోసం ఎన్నుకోవటానికి అధికారిక ఇంటర్వ్యూలను ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. అజయ్ త్యాగి మూడేళ్ల కాలానికి 2017లో సెబీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. అజయ్ త్యాగి పొడిగింపును ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేబినెట్ నియామక కమిటీ ఆమోదించింది.

ఫిన్సెక్ లా అడ్వైజర్స్ వ్యవస్థాపకుడు సందీప్ పరేఖ్ “ సెబీ ఒక గొప్ప సంస్థ, చాలా మంది సమర్థులైన సీనియర్ వ్యక్తులు అతని విలక్షణమైన నియంత్రణ విధానానికి సపోర్ట్ ఇస్తున్నారు. ” అని అన్నారు.

అదనపు కార్యదర్శిగా 2014 నవంబర్‌లో ఆర్థిక మంత్రిత్వ శాఖలో చేరడానికి ముందు పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖలో సంయుక్త కార్యదర్శిగా అజయ్  త్యాగి పనిచేశారు. ఆ సమయంలో అతను విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) సంస్కరణలు, చర్యలకు నాయకత్వం వహించాడు.