గూగుల్ పేలో యూపీఐ లైట్ .. పిన్ లేకుండానే చెల్లింపులు.. లిమిట్ ఎంత?, ఎలా యాక్టివేట్ చేయాలంటే?
ప్రముఖ యూపీఐ పేమెంట్ యాప్ అయిన గూగుల్ పే వినియోగదారులకు మరో సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
ప్రముఖ యూపీఐ పేమెంట్ యాప్ అయిన గూగుల్ పే వినియోగదారులకు మరో సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. వినియోగదారులు యూపీఐ పిన్‌ను నమోదు చేయాల్సిన అవసరం లేకుండా వేగంగా, ఒక-క్లిక్‌తో యూపీఐ లావాదేవీలను చేయడానికి గూగూల్ పే తన ప్లాట్‌ఫారమ్‌లో UPI LITEని అందుబాటులోకి తెచ్చింది. లైట్ ఖాతా వినియోగదారు బ్యాంక్ ఖాతాకు లింక్ చేయబడి ఉంటుందని.. అయితే అది రియల్ టైమ్‌లో జారీ చేసే బ్యాంకు కోర్ బ్యాంకింగ్ వ్యవస్థపై ఆధారపడదని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
యూపీఐ లైట్ అకౌంట్‌కు ఒక్కసారి రూ. 2000 లోడ్ చేసుకోవచ్చు. గరిష్టంగా రోజుకు రెండు సార్లు రూ. 2 వేలు యాడ్ చేసుకునే వీలుంటుంది. అంటే రోజు వారీ లిమిట్ రూ. 4 వేలు. వినియోగదారులు రూ. 200 వరకు తక్షణ యూపీఐ లావాదేవీలను చేయడానికి యూపీఐ లైట్ అనుమతిస్తుంది.
“దేశంలో డిజిటల్ చెల్లింపులను మరింతగా స్వీకరించడానికి ప్రత్యేకమైన ఆఫర్‌లు, వినియోగ సందర్భాలు ప్రధానమైనవి. ప్లాట్‌ఫారమ్‌లో UPI LITE పరిచయంతో వినియోగదారులకు అనుకూలమైన, కాంపాక్ట్, సూపర్‌ఫాస్ట్ చెల్లింపుల అనుభవాన్ని పొందడంలో సహాయపడటం ద్వారా చిన్న-విలువ లావాదేవీలను సులభతరం చేయాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము’’ అని గూగుల్ నుంచి ప్రోడక్ట్ మేనేజ్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్ అంబరీష్ కెంఘే అన్నారు.
ఇక, గూగుల్ పే యాప్ యూజర్‌లు తమ ప్రొఫైల్ పేజీకి వెళ్లి.. యాక్టివేట్ యూపీఐ లైట్‌ని ట్యాప్ చేయవచ్చు. లింకింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత.. వినియోగదారులు తమ యూపీఐ ఖాతాకు రూ. 2,000 వరకు నిధులను జోడించగలరు. రోజుకు గరిష్టంగా రూ. 4,000 పరిమితి ఉంటుంది. ‘‘యూపీఐ లైట్‌లో లోడ్ చేసిన బ్యాలెన్స్‌కు లోబడి.. రూ. 200 కంటే తక్కువ లావాదేవీల చెల్లింపు కోసం యూపీఐ లైట్ ఖాతా డిఫాల్ట్‌గా ఎంపిక చేయబడుతుంది’’ అని కంపెనీ వెల్లడించింది. ఈ చెల్లింపుల కోసం వినియోగదారులు యూపీఐ పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు.
ఇక, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గత ఏడాది సెప్టెంబర్‌లో యూపీఐ లైట్ అనే కొత్త చెల్లింపుల వ్యవస్థను ప్రారంభించింది. UPI లావాదేవీ ప్రక్రియను సులభతరం చేయడానికి యూపీఐ లైట్ ఫీచర్‌ను తీసుకొచ్చారు. అయితే ఇప్పటి వరకు 15 బ్యాంకులు యూపీఐ లైట్‌కు మద్దతు ఇస్తున్నాయి. రాబోయే నెలల్లో మరిన్ని బ్యాంకులు ఈ జాబితాలో చేరనున్నాయి.