Asianet News TeluguAsianet News Telugu

మహిళల కోసం స్కిల్ ప్రోగ్రాంను ప్రవేశపెట్టిన గూగుల్

ఈ కార్యక్రమం ఆగస్టు 28న గూగుల్ హైదరాబాద్ క్యాంపస్‌లో గ్రాడ్యుయేషన్ కార్యక్రమంతో ముగుస్తుంది.కొంత విరామం తర్వాత మళ్ళీ కార్పొరేట్ కెరీర్‌ తిరిగి ప్రారంభించాలని చూస్తున్న మహిళల కోసం అలాగే మిడిల్ కెరీర్‌ను డిజిటల్ మార్కెటింగ్‌కు మార్చాలని చూస్తున్న వారికోసం ఏర్పాటు చేసింది.

google india introduces skill program for women upto 18 weeks
Author
Hyderabad, First Published Mar 7, 2020, 5:16 PM IST

న్యూ ఢిల్లీ: గూగుల్ ఇండియా శుక్రవారం (మార్చి 6) డిజిపివోట్ అనే స్కిల్లింగ్ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది. కొంత విరామం తర్వాత మళ్ళీ కార్పొరేట్ కెరీర్‌ తిరిగి ప్రారంభించాలని చూస్తున్న మహిళల కోసం అలాగే మిడిల్ కెరీర్‌ను డిజిటల్ మార్కెటింగ్‌కు మార్చాలని చూస్తున్న వారికోసం ఏర్పాటు చేసింది.

మహిళల కెరీర్ పోర్టల్ సర్విస్, అవతార్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌తో కలిసి  అభివృద్ధి చేశారు. ఈ కార్యక్రమం భారతదేశంలోని డిజిటల్ మార్కెటింగ్ ల్యాండ్‌స్కేప్‌లో మొత్తం  ప్రభావితం చేయడమే లక్ష్యంగా పేట్టుకుంది. స్కిల్ ప్రోగ్రాం ద్వారా 200 మంది మహిళాలకు తిరిగి నైపుణ్యం ఇవ్వడానికి అవకాశం కల్పిస్తుంది. 

also read యెస్ బ్యాంకు వ్యవస్థపకుడి ఇంట్లో ఈడీ తనిఖీలు... లావాదేవీల్లో అవకతవకలు...కేసు నమోదు

సంస్థ ప్రకారం, స్కిల్ ప్రోగ్రాంలో ఎంపికైన వారు 18 వారాల పాటు లెర్నింగ్ ప్రోగ్రాం (ఆఫ్‌లైన్ మరియు ఆన్‌లైన్ రెండూ) ద్వారా పాల్గొంటారు. ఇందులో పాల్గొనే వారికి డిజిటల్ మార్కెటింగ్, లీడర్ షిప్ స్కిల్స్ పై అవగాహన పెంచాలని  లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ కార్యక్రమం ఆగస్టు 28న హైదరాబాద్ లోని గూగుల్ క్యాంపస్‌లో  గ్రాడ్యుయేషన్ కార్యక్రమంతో ముగుస్తుంది. ఈ కార్యక్రమం ప్రస్తుతం పనిచేస్తున్న మహిళా నిపుణులు, కన్సల్టింగ్, అనలిటిక్స్, బ్రాండింగ్, సేల్స్, డిజిటల్ మార్కెటింగ్ పట్ల 4-10 సంవత్సరాల అనుభవంతో  ఆసక్తి ఉన్నవారు తిరిగి రావడానికి అవకాశం కల్పిస్తుంది.

also read కరోనాతో కోలుకోలేని దెబ్బ: ఆర్థిక వ్యవస్థపై 25 లక్షల కోట్ల దాకా నష్టం ?!

ఈ ప్రోగ్రామ్ పూర్తిగా గూగుల్ స్పాన్సర్ చేస్తుంది. ఇందులో పాల్గొనేవారు ఎటువంటి రిజిస్ట్రేషన్, ఎంట్రీ ఫీజు,  ప్రయాణం లేదా వసతి ఛార్జీలు చెల్లించావలసిన అవసరం లేదు. మార్చి 6 నుండి దరఖాస్తులు స్వీకరిస్తారు అలాగే రిజిస్ట్రేషన్ ఫీజుకి చివరి తేదీ మార్చి 21 అని తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios