గూగుల్ సీఈఓ సుందర్  పిచాయ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు క్షమాపణ చెప్పిన విషయం స్పష్టంగా తెలియకపోయిన ట్రంప్ అక్కడి వార్తా విలేకరులతో మాట్లాడుతున్నప్పుడు ఈ విషయన్ని తెలిపాడు. " గూగుల్, గూగుల్ కమ్యూనికేషన్స్ వారికి నేను కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే మీకు తెలిసినట్లుగా, నేను శుక్రవారం చెప్పిన దానిని వారు నిరూపించారు "అని ట్రంప్ అన్నారు. 

ట్రంప్ శుక్రవారం చెప్పిన విషయం ఏమిటంటే 1,700 మంది ఇంజనీర్లను ఉపయోగించి   కరోనావైరస్ స్క్రీనింగ్‌కు సంబంధించిన వెబ్‌సైట్‌ను గూగుల్  తయారు చేస్తోందట. అయితే గూగుల్ నేరుగా ఈ వెబ్‌సైట్‌ను తయారు చేయటం లేదు, కానీ గూగుల్ పేరెంట్ సంస్థ ఆల్ఫాబెట్   వెరిలీ అని పిలువబడే రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఈ  సైట్‌ను తయారు చేస్తోంది 

also read కరోనా దెబ్బకు ఫార్మాసి రంగం కుదేలు...నిలిచిపోయిన దిగుమతులు...

ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ , “ గూగుల్ సి‌ఈ‌ఓ మమ్మల్ని పిలిచి క్షమాపణలు చెప్పారు.” అని అన్నారు.ఒక న్యూస్ పత్రిక తెలిపిన నివేదిక ప్రకారం ట్రంప్ చెప్పిన సమాచారానికి సంబంధించి గూగుల్ కంపెనీ దేని పై స్పందించలేదు. పిచాయ్ వాస్తవానికి ‘క్షమించండి’ అని చెప్పడ లేదా అనే విషయంపై  ట్రంప్ నిజంగా స్పష్టత ఇవ్వలేదు.

గూగుల్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ట్రంప్ శుక్రవారం చెప్పారు. “నేను గూగుల్ కి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. ఈ వెబ్‌సైట్‌ను అభివృద్ధి చేయడానికి గూగుల్ సహాయం చేస్తోంది. ఇది చాలా త్వరగా పూర్తవుతుంది అని అన్నారు.

also read తగ్గిన పసిడి దిగుమతులు...బంగారాన్ని నగలుగా మార్చి....

మిగతా వెబ్‌సైట్‌ల మాదిరిగా కాకుండా కరోనా వైరస్ పరీక్ష అవసరమా అని నిర్ణయించడానికి అలాగే  సమీప ప్రదేశంలో ఉన్న హాస్పిటల్ లో పరీక్షను చేయడానికి ఇది సహాయపడుతుంది. గూగుల్ కమ్యూనికేషన్స్ ట్విట్టర్ ఖాతాలో  వారు వెబ్‌సైట్‌ను పరీక్షిస్తున్నారని, అయితే బే ఏరియాలో మాత్రమే ఉన్నట్లు అధికారికంగా ట్వీట్‌ చేశారు.

"కోవిడ్ -19 పరీక్ష కోసం చికిత్స చేయడానికి మేము ఒక వెబ్‌సైట్‌ అభివృద్ధి చేస్తున్నాము. ప్రస్తుతం ఇది ప్రారంభ దశలో ఉంది, దీనిని మరింత విస్తృతంగా విస్తరించాలనే ఆశతో బే ఏరియాలో మాత్రమే పరీక్షలను నిర్వహించడానికి  ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ”అని ట్విట్టర్ ద్వారా  ట్వీట్ చేశారు.