Asianet News TeluguAsianet News Telugu

భారత్‌కు అండగా గూగుల్, మైక్రోసాఫ్ట్.. 130కోట్లతో పాటు ఆక్సిజన్ కాన్సెంట్రేటర్స్ కొనుగోలుకు సహాయం

మైక్రోసాఫ్ట్‌ సీఈవో  సత్య నాదెళ్ల, గూగుల్ సీఈవో సుందర్‌ పిచాయ్‌  భారత్‌కు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. గూగుల్‌ సంస్థ, ఉద్యోగులు కలిసి భారత ప్రభుత్వానికి రూ.135 కోట్ల నిధులను, వైద్యసామాగ్రి అందించేందుకు సహాయ పడేలా నిధులను అందిస్తున్నామని సుందర్‌ పిచాయ్‌ వెల్లడించారు.

Google ceo  Sundar Pichai Announces Rs 135 Cr Relief Fund For India COVID Crisis Microsoft ceo Will Aid Relief
Author
Hyderabad, First Published Apr 26, 2021, 11:36 AM IST

 భారతదేశంలో కొనసాగుతున్న కోవిడ్-19 సంక్షోభంపై భారత సంతతికి చెందిన టెక్ దిగ్గజ కంపెనీల సి‌ఈ‌ఓలు ముందుకొచ్చారు.  మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్య నాదెల్ల, గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్ దేశంలోని అత్యవసర పరిస్థితులపై పోరాడటానికి సహాయం ప్రకటించారు. 

దేశంలోని ప్రస్తుత పరిస్థితులు తనకు భాధని కలిగిస్తున్నాయని సత్య నాదెళ్ల సోమవారం ట్వీట్‌ చేశారు. అలాగే ముఖ్యంగా ఇండియాలో తీవ్ర ఆక్సిజన్‌ కొరత నేపథ్యంలో దేశానికి సహాయం అందించనుట్టు ప్రకటించారు.

సహాయ ఉపశమన ప్రయత్నాలు, సాంకేతిక పరిజ్ఞానం,ఇతర వనరుల ద్వారా నిరంతర మద్దతుతో పాటు కీలకమైన ఆక్సిజన్ సాంద్రత పరికరాల కొనుగోలుకు కంపెనీ సహాయం ఇవ్వనున్నట్టు తెలిపారు. భారతదేశంలో గత 24 గంటల్లో 3.5 లక్షలకు పైగా కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి, అలాగే కరోనా  కారణంగా 2,800 మందికి పైగా మరణాలు నమోదయ్యాయి.

గూగుల్ సి‌ఈ‌ఓ సుందర్ పిచాయ్ భారతదేశంలోని ప్రస్తుత పరిస్థితిని అధిగమించడానికి  సహాయం అందించనున్నట్లు ఒక బ్లాగ్ పోస్ట్‌ను షేర్ చేశారు. గూగుల్‌ సంస్థ, ఉద్యోగులు కలిసి భారత ప్రభుత్వానికి రూ.135 కోట్ల నిధులను, వైద్యసామాగ్రి కోసం యునిసెఫ్, హై-రిస్క్ కమ్యూనిటీలకు మద్దతు ఇవ్వడంతోపాటు, క్లిష్టమైన సమాచారాన్ని అందించేందుకు   సహాయ పడేలా నిధులను అందిస్తున్నామని సుందర్‌ పిచాయ్‌ వెల్లడించారు.

 

135 కోట్ల రూపాయల నిధుల్లో గూగుల్.ఆర్గ్ నుండి రెండు మంజూరులు ఉన్నాయి. మొదటిది గివ్ఇండియాకు, కరోనా సంక్షోభంలో  తీవ్రంగా నష్టపోయిన కుటుంబాల రోజువారీ ఖర్చులకు సహాయం చేయడానికి నగదు సహాయం. రెండవ మంజూరు యునిసెఫ్‌కు వెళుతుంది, ఇది భారతదేశంలో ఎక్కువగా అవసరమైన చోట ఆక్సిజన్, టెస్ట్ కిట్ తో సహా అత్యవసర వైద్య సామాగ్రిని అందించడానికి సహాయపడుతుంది.  

కాగా గత 24 గంటల్లో దేశంలో రికార్డుస్తాయిలో 3.52 లక్షలకు పైగా కొత్త కోవిడ్-19 కేసులు కాగా 2812 మరణాలు నమోదైనాయి. మొత్తం 2,19,272 బాధితులు ఆసుపత్రినుంచి డిశ్చార్జ్‌ అయ్యారు.  

also read రిలయన్స్‌ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ చేతికి మరో చారిత్రక ఐకానిక్ బ్రిటిష్ కంపెనీ.. ...

దేశంలో కరోనా పరిస్థితులు, ఆక్సిజన్‌, నిత్యావసర మందుల సరఫరా కొరత  నేపథ్యంలో బ్రిటన్‌, అమెరికా, సౌదీ అరేబియా, సింగపూర్‌ లాంటి దేశాలు ఇప్పటికే తమ సాయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సింగపూర్ నుండి 500 బైపాప్‌లు, 250 ఆక్సిజన్ కాన్‌సెంట్రేటర్లు,   ఇతర వైద్య సామాగ్రితో ఎయిర్ ఇండియా విమానం ఆదివారం రాత్రి ముంబైలో ల్యాండ్ అయింది. 

మైక్రోసాఫ్ట్ సీఈఓ  సత్య నాదెల్ల మాట్లాడుతూ "అత్యంత తీవ్రమైన ఆరోగ్య సంక్షోభంలో ఉన్న భారత్‌కు సహాయం చేయడానికి మైక్రోసాఫ్ట్ తన వంతు కృషి చేస్తుందని" చెప్పారు. అలాగే ఒక ట్వీట్‌ ద్వారా  సంస్థ తన వాయిస్, రిసోర్సెస్, టెక్నాలజి, సహాయక చర్యలు అందించేందుకు సహాయం చేస్తుంది ఇంకా అత్యవసర ఆక్సిజన్ సాంద్రత పరికరాల కొనుగోలుకు సహాయం ఇస్తుంది అని పోస్ట్ చేశారు.

 

కోవిడ్-19 సంక్షోభం నుండి భారత్‌కు సహాయం చేయడానికి ప్రయత్నాలను సమీకరించినందుకు అమెరికా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని సత్య నాదెల్లా అన్నారు. భారత్ కోవిడ్-19 సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి, ఇండియాకి సహాయపడటానికి అవసరమైన వైద్య సామాగ్రి, పరికరాలు పంపడంతో పాటు  సహాయాన్ని  అందిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్  హామీ ఇచ్చారు.

ఈ కఠినమైన సమయాల్లో టెక్నాలజీ, సోషల్ మీడియా చాలా సహాయంగా ఉన్నాయి. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలోని వినియోగదారులు కోవిడ్-19 రోగులకు వారి కుటుంబాలకు అత్యవసర సమాచారం లేదా ఆసుపత్రి అడ్మిషన్, ఆక్సిజన్ సప్లయి, మందులు,  హాపిటల్ లో బెడ్స్ లభ్యత, అంబులెన్సులు వంటి సహాయం చేస్తున్నారు.

ఇంగ్లీష్  తో పాటు ఇతర ఎనిమిది ప్రాంతీయ భాషలలో  గూగుల్ సెర్చ్ లో  కోవిడ్-19 వ్యాక్సిన్ సమాచారాన్ని అందించడానికి  గూగుల్ తమ వంతు కృషి చేస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకు వారి చుట్టూ ఉన్న లేదా సమీపంలో ఉన్న కోవిడ్-19  టెస్ట్ సెంటట్లు లేదా వాక్సిన్ కేంద్రాలను తెలుసుకోవడానికి గూగుల్ మ్యాప్స్ వంటివి  ఉపయోగించవచ్చు.  

Follow Us:
Download App:
  • android
  • ios