బెంగళూరు: టాక్సీ సంస్థలు ఉబెర్, ఓలా డ్రైవరులు ప్రతి రైడ్ ద్వారా సంపాదించిన  మొత్తం ఛార్జీలలో 10% వరకు కమీషన్‌ గరిష్టంగా పరిమితం చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఉబెర్, ఓలా సంస్థలు డ్రైవర్ల నుండి సేకరించిన కమీషన్‌ను నియంత్రించటానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తిసుకోవడం ఇదే మొదటిసారి.

ప్రస్తుతం ఉబెర్, ఓలా ఒక్క రైడ్ కు క్యాబ్ డ్రైవరుల నుండి  20% కమిషన్ తిసుకుంటుంది. కావాలంటే రాష్ట్ర ప్రభుత్వాలే అలాంటి సంస్థల ఆదాయాలపై ఛార్జీ విధించవచ్చు."వచ్చే వారం ఎప్పుడైనా నూతన మార్గదర్శకాలపై  ప్రజల అభిప్రాయాల కోసం ముసాయిదా (అగ్రిగేటర్ నియమాలు) ను విడుదల చేయాలని మేము యోచిస్తున్నాము" అని రోడ్డు రవాణా, హైవే మంత్రిత్వ శాఖకు చెందిన ఓ అధికారి తెలిపారు.  

also read  ‘కార్వీ’ది ఎప్పుడూ ఇల్లీగల్ స్టయిలే.. అందుకే: సెబీ చీఫ్‌

సెప్టెంబర్ 1  2019 నుండి అమల్లోకి వచ్చిన మోటారు వాహన చట్టం కింద  క్యాబ్ అగ్రిగేటర్లకు తుది నియమాలు ఈ సంవత్సరం ముగిసేలోపు అధికారికంగా మారే అవకాశం ఉంది.భద్రతా రంగంలో ప్రతి రైడర్‌కు ప్రభుత్వం రూ .5 లక్షల బీమా సౌకర్యాన్ని తప్పనిసరి చేయలని మార్గదర్శకాలు తెలిపాయి.

అగ్రిగేటర్లు ప్రతి మూడు గంటలకు ఒకసారి ముఖ గుర్తింపు లేదా బయోమెట్రిక్స్ ద్వారా డ్రైవర్‌ను ధృవీకరించవలసి ఉంటుంది, రైడ్ చేపట్టే డ్రైవర్ సంస్థలో చేర్చుకున్న వ్యక్తి  మాత్రమే ఉండాలని ప్రయాణికులు నిర్ధారించుకోండి."ఒక క్యాబ్ రహదారిపై 10 వ్యక్తిగత కార్లను భర్తీ చేస్తుంది మరియు ఏ సమయంలోనైనా 35% వ్యక్తిగత కారు ప్రయాణాలు పనిలేకుండా ఉంటాయి ”అని సీనియర్ అధికారులలో ఒకరు చెప్పారు.

also read  ప్రైవేటీకరణ చేస్తేనే బతుకు లేదంటే ‘మహారాజా‘కు తాళమే: కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్

దేశంలో రైడ్-హెయిలింగ్‌ను ప్రోత్సహించడానికి ఈ నియమాలు అనుగుణంగా ఉన్నాయని  డ్రైవర్ మరియు రైడర్ ప్రయోజనాలను కూడా పరిరక్షించాలని ఆయన అన్నారు. అగ్రిగేటర్ యాప్స్ లకు అనుసంధానించడానికి సిటీ టాక్సీ పర్మిట్ హోల్డర్లను రాష్ట్రాలు అనుమతించాలని మార్గదర్శకాలు సూచిస్తున్నాయి. ఇంకా, రైడ్-హెయిలింగ్ కంపెనీలకు అనుసంధానించబడిన క్యాబ్‌లకు పబ్లిక్ పార్కింగ్ స్థలాలు కేటాయించేలా రాష్ట్ర ప్రభుత్వాలు చూడాలి. “ ఓ అధికారి తెలిపారు.