Asianet News TeluguAsianet News Telugu

గుడ్ న్యూస్ : మార్చిలో జీఎస్టీ వసూలు సరికొత్త రికార్డు.. వరుసగా 6 నెలలో కూడా రూ.1 లక్ష కోట్ల పైకి..

 వస్తు, సేవల పన్ను (జీఎస్‌టి) వసూలు వరుసగా ఆరో నెలలో కూడా  రూ .1 లక్ష కోట్లు దాటింది. మార్చిలో జీఎస్‌టి వసూలు రూ .1,23,902 కోట్లు అని ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. 

Good news: GST collection set new record in March 2021, government gets 1.23 lakh crore rupees above
Author
Hyderabad, First Published Apr 2, 2021, 2:56 PM IST

 కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా విధించిన లాక్ డౌన్ సమయంలో  ఆర్ధిక వ్యవస్థ స్తంభించిపోయిన సంగతి మీకు  తెలిసిందే.  అయితే లాక్ డౌన్ సడలింపుతో ఆర్థిక వ్యవస్థ మళ్ళీ తిరిగి ట్రాక్‌లోకి వస్తుంది. అయితే తాజాగా వస్తు, సేవల పన్ను (జీఎస్‌టి) వసూలు వరుసగా ఆరో నెలలో కూడా  రూ .1 లక్ష కోట్లు దాటింది.

మార్చిలో జీఎస్‌టి వసూలు రూ .1,23,902 కోట్లు అని ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. ఈ భారీ మొత్తం జి‌ఎస్‌టి  వసూలు దేశంలో జి‌ఎస్‌టి ప్రవేశపెట్టినప్పటి నుండి అత్యధికం. అలాగే కరోనా వ్యాప్తి తరువాత వరుసగా నాలుగోసారి కూడా రూ .1.1 లక్షల కోట్లు దాటడం గమనార్హం. మరోవైపు కొందరు దీనిని ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధికి సంకేతంగా భావిస్తున్నారు. 

ఆర్థిక మంత్రిత్వ శాఖ  ప్రకారం మార్చి 2021లో సెంట్రల్ జిఎస్‌టి (సిజిఎస్‌టి) వాటా రూ .22,973 కోట్లు, స్టేట్ జిఎస్‌టి (ఎస్‌జిఎస్‌టి) వాటా రూ .29,329 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జిఎస్‌టి (ఐజిఎస్‌టి) వాటా రూ .6,842 కోట్లు. అలాగే సెస్ వాటా రూ .8,757 కోట్లు. ఇందులో 935 కోట్ల రూపాయలను వస్తువుల దిగుమతిపై పన్ను నుంచి వచ్చాయి. అంతకుముందు నెల ఫిబ్రవరిలో జిఎస్‌టి వసూలు రూ .1,13,143 కోట్లు. 

also read కాలగర్భంలోకి 132 ఏళ్ల చరిత్ర.. బ్రిటీష్ కాలం నాటి మిలటరీ డెయిరీలు మూసివేత ...

మార్చి 2021లో వచ్చిన ఆదాయం అంతకుముందు కంటే 27 శాతం ఎక్కువ. జిఎస్‌టి, ఆదాయపు పన్ను, కస్టమ్స్ ఐటి వ్యవస్థలతో సహా వివిధ వనరుల నుంచి వచ్చిన డేటాను  నిశితంగా పరిశీలించామని, ఇది ఆదాయ సేకరణకు దోహదపడిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. 

 

ప్రతినెల జీఎస్‌టి  కలెక్షన్ 
మార్చి 2020- 97,597
ఏప్రిల్ 2020- 32,294
మే 2020 -62,009
జూన్ 2020 -90,917
జూలై 2020- 87,422
ఆగస్టు 2020- 86,449
సెప్టెంబర్ 2020 -95,480
అక్టోబర్ 2020 -1,05,155
నవంబర్ 2020 -1,04,963
డిసెంబర్ 2020- 1,15,174
జనవరి 2021- 1,19,847
ఫిబ్రవరి 2021- 1,13,143 
మార్చి 2021 -1,23,902 

భారతదేశంలో విద్యుత్ వినియోగం కూడా మార్చిలో 24.35 శాతం పెరిగింది
మార్చి 2021లో దేశంలోని విద్యుత్ మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం గత సంవత్సరం ఇదే నెల ఆర్థిక కార్యకలాపాల మెరుగుదలను ప్రతిబింబిస్తూ 24.35 శాతం పెరిగి 123.05 బిలియన్ యూనిట్లకు (బియు) పెరిగింది. గత ఏడాది మార్చిలో విద్యుత్ వినియోగం 98.95 బియుగా నమోదైంది. మరోవైపు,  2020 మార్చిలో 170.16 గిగావాట్లతో పోలిస్తే ఈ ఏడాది మార్చిలో గరిష్ట విద్యుత్ సరఫరా మార్చి 11న 186.03 గిగావాట్లను దాటింది.  
 

Follow Us:
Download App:
  • android
  • ios