ఆషాడ మాసంలో బంగారం ధర భారీగా తగు ముఖం పడుతుంది ముఖ్యంగా అంతర్జాతీయంగా గమనించినట్లయితే పసిగి ధరలు గడచిన నెల రోజుల్లో భారీగా తగ్గిపోయాయి ప్రధానంగా అమెరికా మార్కెట్లలో బంగారం ధర భారీగా తగ్గుతుంది.
ప్రస్తుతం అమెరికాలో బంగారం 31 గ్రాముల ధర 1920 డాలర్లు ఉంది. గత నెల ఇదే రోజున అంటే జూన్ మూడో తారీకున బంగారం ధర 31 గ్రాములు 1980 డాలర్లు పలికింది ఈ లెక్కన పోల్చి చూసినట్లయితే గడచిన నెల రోజుల్లో బంగారం ధర దాదాపు 60 డాలర్లు తగ్గింది. ఇక మే నెలలో బంగారం ధర గరిష్ట స్థాయికి చేరింది ఆ నెలలో 31 గ్రాముల బంగారం ధర 2030 డాలర్లు పలికింది. ఆ స్థాయి నుంచి పసిడి ధర పడుతూ వస్తూ ప్రస్తుతం 1920 డాలర్లకు స్థిరపడింది ఈ లెక్కన చూసినట్లయితే బంగారం ధర 110 డాలర్లు తగ్గింది దేశీయంగా కూడా బంగారం ధరలు భారీగా తగ్గిపోతున్నాయి దీని వెనక కారణం లేకపోలేదు ముఖ్యంగా అమెరికాలో బాండ్ మార్కెట్లు బలంగా విస్తరిస్తున్నాయి ఫలితంగా అమెరికన్ బాండ్లలో పెట్టుబడి పెట్టేందుకు పెట్టుబడిదారులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు గతంలో అమెరికాలో ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో బంగారం పై పెట్టుబడిదారులు ఎక్కువగా ఆసక్తి చూపించారు ప్రస్తుతం బంగారం నుంచి లాభాలు ఉపసంహరించుకొని పెట్టుబడిదారులు బంగారం వైపు తరులుతున్నారు. ఫలితంగా భారతదేశంలో సైతం బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి.
మనదేశంలో గమనించినట్లయితే, ప్రస్తుతం బంగారం ధర 10 గ్రాములకు గాను 24 క్యారెట్ల బంగారం ధర 58,960 రూపాయలుగా ఉంది అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర 54,050 రూపాయలు పలుకుతోంది. మే నెలలో బంగారం ధర గరిష్టంగా 62,400 రూపాయలు పలికింది.అక్కడి నుంచి ప్రస్తుతం గడచిన రెండు నెలల్లో పతనం అవుతూ వస్తోంది. ఈ లెక్కన గమనించినట్లయితే బంగారం ధర గరిష్ట స్థాయి నుంచి దాదాపు 3,500 తగ్గినట్లు మనం గమనించవచ్చు.
దీంతో పాటు బంగారం ధర ఆషాడమాసం కారణంగా కూడా దేశీయంగా తగ్గుతూ వస్తోంది ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ లేకపోవడంతో పసిడి ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. ఇదిలా ఉంటే బంగారం ధరలు తగ్గుముఖం పట్టడం వల్ల కొత్తగా బంగారం కొనుగోలు చేయాలి అనుకునే వారికి ఇది ఒక రకంగా సువర్ణ అవకాశం అనే చెప్పాలి. బంగారం ధర ఎంత తగ్గితే అంతా కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుందని మీ పోర్ట్ఫోలియోలో బంగారాన్ని కలుపుకోవడం ద్వారా భవిష్యత్తులో చాలా లాభపడవచ్చు అని నిపుణులు పేర్కొంటున్నారు.
ఇదిలా ఉంటే బంగారం ధరలు భవిష్యత్తులో మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బంగారం ధరలు గరిష్ట స్థాయి నుంచి నెమ్మదిగా తగ్గుతూ డిసెంబర్ నాటికల్లా 50 వేలకు దిగివచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు ఇదే కనుక నిజం అయితే పసిడి ప్రియులకు ఒక రకంగా చెప్పాలంటే పండగే అని చెప్పవచ్చు.
