పెరిగిన బంగారం, వెండి ధరలు... నేడు 24 క్యారెట్ల తులం ధర ఎంతంతే..?
ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,450, 24 క్యారెట్ల ధర రూ.52,970గా ఉంది, 10 గ్రాముల వెండి ధర రూ.623గా ఉంది. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 1777 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అలాగే డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 81.32 వద్ద ఉంది.

గత కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరల్లో అస్థిరత కనిపిస్తోంది. అయితే బుధవారం బంగారం ధరలు తగ్గుముఖం పట్టగా, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. కానీ నేడు బంగారం ధరలు స్థిరంగా ఉండగా, వెండి ధరలు పెరిగాయి.
ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,450, 24 క్యారెట్ల ధర రూ.52,970గా ఉంది, 10 గ్రాముల వెండి ధర రూ.623గా ఉంది. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 1777 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అలాగే డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 81.32 వద్ద ఉంది.
హైదరాబాద్, బెంగళూరు, కేరళ అండ్ విశాఖపట్నంలలో వెండి ధర స్థిరంగా ఉండగా, ఈ రోజు బంగారం ధరలు కాస్త పెరిగాయి. ఇటీవలి కాలంలో బంగారం ధరలు అస్థిరంగా ఉండడం, భారత రూపాయి బలహీనపడడమే ఇందుకు కారణమని నిపుణులు పేర్కొంటున్నారు.
అయితే, గురువారం ప్రముఖ నగరాల్లో పసిడి ధరల ప్రకారం బెంగళూరు నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,560, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 53,850. హైదరాబాద్‌లో బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ. 48,550గా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,850.
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,550, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 53,850. విశాఖపట్నంలో బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 48,550, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 53,850.
ప్రముఖ నగరాల్లో కేజీ వెండి ధర
చెన్నై - రూ.68,000
ఢిల్లీ - రూ 62,300
హైదరాబాద్ - రూ 68,000
కోల్‌కతా - రూ.62,300
లక్నో - రూ.62,300
ముంబై - రూ.62,300
నాగ్‌పూర్ - రూ.62,300
పూణే - రూ.62,300
బంగారం స్వచ్ఛత తెలుసుకోవడం ఎలా?
బంగారం స్వచ్ఛతను గుర్తించడానికి ISO (ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్) ద్వారా హాల్ మార్కులు ఇస్తారు. 24 క్యారెట్లపై 999, 23 క్యారెట్లపై 958, 22 క్యారెట్లపై 916, 21 క్యారెట్లపై 875, 18 క్యారెట్లపై 750. చాలా వరకు బంగారాన్ని 22 క్యారెట్లలో విక్రయిస్తుండగా, కొందరు 18 క్యారెట్లను కూడా విక్రయిస్తారు. క్యారెట్ ఎంత ఎక్కువ ఉంటే బంగారం అంత స్వచ్ఛంగా ఉంటుందని చెబుతారు.
22 అండ్ 24 క్యారెట్ల మధ్య తేడా ఏమిటి?
24 క్యారెట్ల బంగారం 99.9% స్వచ్ఛమైనది, 22 క్యారెట్ దాదాపు 91% స్వచ్ఛమైనది. 22 క్యారెట్ల బంగారానికి 9% రాగి, వెండి, జింక్ వంటి ఇతర లోహాలను కలిపి ఆభరణాలు తయారు చేస్తారు. 24 క్యారెట్ల బంగారం మృదువైనది అయితే దానితో ఆభరణాలుగా తయారు చేయడం సాధ్యం కాదు.