Asianet News TeluguAsianet News Telugu

పెళ్లిళ్ల సీజన్ లో బంగారం కొనేందుకు మంచి ఛాన్స్.. నేడు బంగారం, వెండి ధరలు ఎంతంటే..?

ఈ రోజు ముంబై, కోల్‌కతా, హైదరాబాద్, కేరళ ఇంకా పుణెలలో 10 గ్రాముల బంగారం 24 క్యారెట్ల ధర  రూ. 54,330 22 క్యారెట్ల ధర రూ. 49,800 వద్ద అమ్ముడవుతోంది.

Gold silver rates unchanged in early trade yellow metal at Rs 54,330 check your city rates here
Author
First Published Dec 14, 2022, 9:41 AM IST

నేడు బుధవారం ప్రారంభ ట్రేడింగ్‌లో బంగారం, వెండి ధరలల్లో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం పది గ్రాముల బంగారం 24 క్యారెట్ల ధర రూ.54,330 వద్ద ట్రేడవుతున్నాయి. మరోవైపు నేడు కిలో వెండి ధర రూ.69,000 వద్ద ట్రేడవుతోంది.

ఒక నివేదిక ప్రకారం, ఈ రోజు పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,800 వద్ద ట్రేడవుతోంది.

ముంబై, కోల్‌కతా, హైదరాబాద్, కేరళ ఇంకా పుణెలలో 10 గ్రాముల బంగారం 24 క్యారెట్ల ధర  రూ. 54,330 22 క్యారెట్ల ధర రూ. 49,800 వద్ద అమ్ముడవుతోంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల  బంగారం ధర రూ.54,490. 22 క్యారెట్ల ధర రూ.49,950 వద్ద ట్రేడవుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,980.  22 క్యారెట్ల బంగారం ధర రూ.50,400 వద్ద ట్రేడవుతోంది.

 0046 GMT నాటికి స్పాట్ బంగారం ఔన్సుకు $1,809.35 వద్ద కొద్దిగా మారింది. US గోల్డ్ ఫ్యూచర్స్ 0.2 శాతం తగ్గి $1,821.10 వద్ద ఉన్నాయి.

SPDR గోల్డ్ ట్రస్ట్, ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్-బ్యాక్డ్ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్ మంగళవారం దాని హోల్డింగ్స్ 0.3 శాతం పెరిగి 912.72 టన్నులకు చేరుకుంది.

ముంబై, ఢిల్లీ, కోల్‌కతాలో ఈరోజు కిలో వెండి ధర రూ.69,000 వద్ద ట్రేడవుతోంది. కాగా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లలో కిలో వెండి ధర రూ.73,000గా ఉంది. స్పాట్ వెండి 0.3 శాతం తగ్గి 23.65 డాలర్లకు చేరుకుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios