Asianet News TeluguAsianet News Telugu

బంగారం కొనేవారికి మంచి ఛాన్స్.. పడిపోతున్న పసిడి, వెండి.. నేడు 10 గ్రాములకు ఎంతంటే..?

నేడు ముంబై, కోల్‌కతా, హైదరాబాద్, కేరళ అండ్ పుణెలలో 10 గ్రాముల బంగారం 24 క్యారెట్ల ధర రూ. 53,780,  22 క్యారెట్ల  ధర రూ. 49,300 వద్ద అమ్ముడవుతోంది. ఢిల్లీ, ముంబైలలో కిలో వెండి ధర రూ.66,000గా ఉంది. 

Gold silver rates fall in early trade yellow metal trading at Rs 53,780 know latest rates here
Author
First Published Dec 7, 2022, 10:46 AM IST

బంగారం వెండి కొనాలని ఆలోచిస్తున్న వారికి మచి ఛాన్స్.  మంగళవారం నేడు బంగారం ధరలో పెరుగుదల కనిపించగా, నేడు ఈ పెరుగుదలకు బ్రేక్ పడి బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి.

ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల  బంగారం  ధర రూ.49,300, 24 క్యారెట్ల ధర రూ.53,780గా ఉండగా, 10 గ్రాముల వెండి ధర రూ.660గా ఉంది.బుధవారం ప్రారంభ ట్రేడింగ్‌లో  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర  రూ. 330 క్షీణించి రూ. 53,780 వద్ద  ఉండగా, వెండి ధరలు ఈ రోజు కిలోకు రూ. 500 తగ్గి రూ. 66,000కి చేరుకున్నాయి.


ముంబై, కోల్‌కతా, హైదరాబాద్, కేరళ అండ్ పుణెలలో 10 గ్రాముల బంగారం 24 క్యారెట్ల ధర రూ. 53,780,  22 క్యారెట్ల  ధర రూ. 49,300 వద్ద అమ్ముడవుతోంది.ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 53,930, 22 క్యారెట్ల ధర రూ. 49,450 వద్ద ట్రేడవుతోంది. చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్లు బంగారం ధర రూ.54,650,  22 క్యారెట్ల పసిడి ధర రూ.50,100గా ఉంది.

0008 GMT నాటికి స్పాట్ బంగారం ఔన్సుకు $1,770.46 డాలర్ల వద్ద, US గోల్డ్ ఫ్యూచర్స్ $1,783.10 డాలర్ల వద్ద స్థిరంగా ఉన్నాయి.ఢిల్లీ, ముంబైలలో కిలో వెండి ధర రూ.66,000గా ఉంది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లలో కిలో వెండి ధర రూ.70,800 వద్ద ట్రేడవుతోంది. స్పాట్ సిల్వర్ 0.1% తగ్గి $22.13 డాలర్లకి, ప్లాటినం $988.42  డాలర్ల వద్ద, పల్లాడియం $1,848.48  డాలర్ల వద్ద మారలేదు.

22 క్యారెట్ల అలాగే 24 క్యారెట్ల మధ్య తేడా ఏమిటి?

24 క్యారెట్ల బంగారం 99.9% స్వచ్ఛమైనది. 22 క్యారెట్ దాదాపు 91% స్వచ్ఛమైనది. 22 క్యారెట్ల బంగారానికి 9% రాగి, వెండి, జింక్ వంటి ఇతర లోహాలను కలిపి ఆభరణాలు తయారు చేస్తారు. 24 క్యారెట్ల బంగారం మృదువైనది అయితే  ఆభరణాలుగా  తయారు చేయడం సాధ్యం కాదు. కాబట్టి చాలా మంది దుకాణదారులు బంగారాన్ని 22 క్యారెట్లలో విక్రయిస్తారు.

బంగారం స్వచ్ఛత తెలుసుకోవడం ఎలా?
బంగారం స్వచ్ఛతను గుర్తించడానికి ISO (ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్) ద్వారా హాల్ మార్కులు ఇస్తారు. 24 క్యారెట్లపై 999, 23 క్యారెట్లపై 958, 22 క్యారెట్లపై 916, 21 క్యారెట్లపై 875, 18 క్యారెట్లపై 750. చాలా వరకు బంగారాన్ని 22 క్యారెట్లలో విక్రయిస్తుండగా, కొందరు 18 క్యారెట్లను కూడా ఉపయోగిస్తున్నారు. క్యారెట్ ఎంత ఎక్కువ ఉంటే బంగారం అంత స్వచ్ఛంగా ఉంటుందని చెబుతారు.

Follow Us:
Download App:
  • android
  • ios