Asianet News TeluguAsianet News Telugu

వరుసగా 3వ రోజు పడిపోయిన బంగారం వెండి ధరలు.. నేడు 10గ్రా,. పసిడి ధర ఎంతంటే ?

ఈ రోజు ఎంసిఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాముల బంగారం ధర 0.43 శాతం తగ్గి రూ.50,546 చేరుకుంది. ఎంసిఎక్స్  సిల్వర్ ఫ్యూచర్స్ వెండి ధర 0.6 శాతం క్షీణించి కిలోకు రూ.62,875 చేరుకుంది.  ప్రపంచ మార్కెట్లలో కూడా బంగారం ధరలు తగ్గాయి.

 

gold silver prices trading weak due covid 19 vaccine hopes in india
Author
Hyderabad, First Published Nov 18, 2020, 1:06 PM IST

భారతదేశంలో బంగారం, వెండి ధరలు నేడు  వరుసగా నేడు మూడవ రోజు కూడా క్షీణించాయి. ఈ రోజు ఎంసిఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాముల బంగారం ధర 0.43 శాతం తగ్గి రూ.50,546 చేరుకుంది. ఎంసిఎక్స్  సిల్వర్ ఫ్యూచర్స్ వెండి ధర 0.6 శాతం క్షీణించి కిలోకు రూ.62,875 చేరుకుంది. 

 ప్రపంచ మార్కెట్లలో కూడా బంగారం ధరలు తగ్గాయి, ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నప్పటికీ బంగారం ధరలు పడిపోయాయి. బంగారం ఔన్సు ధర 0.45 శాతం తగ్గి 1,876.85 డాలర్లకు చేరుకుంది. ఇతర విలువైన లోహాలలో వెండి ఔన్సుకు 0.65 శాతం క్షీణతతో 24.47 డాలర్లు చేరింది.

also read సెన్సెక్స్-నిఫ్టీ విజృంభణ, తొలిసారి 44,000 పాయింట్లను దాటిన సెన్సెక్స్‌ ...

అమెరికన్ ఔషధ సంస్థ మోడెర్నా ఇంక్., కోవిడ్ -19ను నివారించడంలో 94.5 శాతం ప్రభావవంతంగా ఉందని కనుగొన్నారు.  కోవిడ్‌-19 నివారణకు అభివృద్ధి చేసిన వాక్సిన్ కు త్వరలో అనుమతులు లభిస్తుంది అంటూ ఆశావహంగా స్పందించడంతో బంగారం, వెండి ఫ్యూచర్స్‌లో అమ్మకాలు తలెత్తుతున్నట్లు బులియన్‌ వర్గాలు పేర్కొన్నాయి.  

మోడెర్నా ఇంక్  వ్యాక్సిన్ ప్రకటించిన తరువాత బంగారం ధరలు ప్రభావితమయ్యాయని, ప్రస్తుత పరిస్థితుల్లో తీవ్రతరం అవుతున్న కరోనా వైరస్ వ్యాప్తి సవాళ్లతో నిండి ఉందని, దీనివల్ల దేశంలోని పలు ప్రాంతాల్లో అధికారులు కఠినమైన ఆంక్షలు విధించారు. 

భారతదేశంలో బంగారం దిగుమతులు ఆగస్టులో 3.7 బిలియన్ డాలర్లకు పెరిగాయి. గత ఏడాది ఇదే నెలలో 1.36 బిలియన్ డాలర్లుగా ఉంది. చైనా తరువాత భారతదేశం బంగారం కొనుగోలులో రెండవ స్థానంలో ఉంది. భారతదేశంలో బంగారం పై 12.5% దిగుమతి సుంకాన్ని, 3 % జీఎస్టీ అమలులో ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios