Asianet News TeluguAsianet News Telugu

పసిడి ధరలకు రెక్కలు.. నేడు ఎగిసిన బంగారం, వెండి.. ఒక్కరోజులో ఎంత పెరిగిందంటే.. ?

ఒక వెబ్‌సైట్ ప్రకారం నిన్నటి ధరతో పోలిస్తే పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.250 పెరిగి రూ.49,750 వద్ద ట్రేడవుతోంది.ముంబై, కోల్‌కతా, హైదరాబాద్, కేరళ అండ్ పుణెలలో 10 గ్రాముల బంగారం 24 క్యారెట్లు ధర  రూ. 54,280, 22 క్యారెట్ల ధర రూ.49,750గా ఉంది.

Gold silver prices rise in early trade yellow metal trading at Rs 54,280
Author
First Published Dec 10, 2022, 9:36 AM IST

పెళ్లిళ్ల సీజన్‌ నేపథ్యంలో దేశీయ బులియన్‌ మార్కెట్‌లో బంగారానికి డిమాండ్‌ పెరిగింది. నేడు శనివారం ప్రారంభ ట్రేడింగ్‌లో బంగారం ధర 10 గ్రాముల 24 క్యారెట్లకు రూ.280 పెరిగి 54,280కి చేరుకుంది. మరోవైపు వెండి ధర ఈరోజు కిలోకు రూ.1,400 పెరిగి రూ.67,600కి చేరుకుంది.

ఒక వెబ్‌సైట్ ప్రకారం నిన్నటి ధరతో పోలిస్తే పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.250 పెరిగి రూ.49,750 వద్ద ట్రేడవుతోంది.

ముంబై, కోల్‌కతా, హైదరాబాద్, కేరళ అండ్ పుణెలలో 10 గ్రాముల బంగారం 24 క్యారెట్లు ధర  రూ. 54,280, 22 క్యారెట్ల ధర రూ.49,750గా ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,440, 22 క్యారెట్ల ధర రూ.49,900 వద్ద ట్రేడవుతోంది. చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్లు బంగారం ధర రూ.55,060, , 22 క్యారెట్ల ధర రూ.50,470గా ఉంది.

1907 GMT నాటికి స్పాట్ బంగారం 0.5 శాతం పెరిగి ఔన్సుకు $1,798.40 డాలర్లకి చేరుకుంది. US గోల్డ్ ఫ్యూచర్స్ 0.5 శాతం పెరిగి $1,810.70 డాలర్ల వద్ద స్థిరపడ్డాయి.

ఢిల్లీ, ముంబైలలో కిలో వెండి ధర రూ.67,600గా ఉంది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లలో కిలో వెండి ధర రూ.72,500 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.468 వద్ద కొనసాగుతోంది.

బంగారం స్వచ్ఛత తెలుసుకోవడం ఎలా?

బంగారం స్వచ్ఛతను గుర్తించడానికి ISO (ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్) ద్వారా హాల్ మార్కులు ఇస్తారు. 24 క్యారెట్లపై 999, 23 క్యారెట్లపై 958, 22 క్యారెట్లపై 916, 21 క్యారెట్లపై 875, 18 క్యారెట్లపై 750. చాలా వరకు బంగారాన్ని 22 క్యారెట్లలో విక్రయిస్తుండగా, కొందరు 18 క్యారెట్లను కూడా ఉపయోగిస్తున్నారు. క్యారెట్ ఎంత ఎక్కువ ఉంటే బంగారం అంత స్వచ్ఛంగా ఉంటుందని చెబుతారు.

22 అండ్ 24 క్యారెట్ల మధ్య తేడా ఏమిటి?
24 క్యారెట్ల బంగారం 99.9% స్వచ్ఛమైనది, 22 క్యారెట్ దాదాపు 91% స్వచ్ఛమైనది. 22 క్యారెట్ల బంగారానికి 9% రాగి, వెండి, జింక్ వంటి ఇతర లోహాలతో కలిపి ఆభరణాలు తయారు చేస్తారు. 24 క్యారెట్ల బంగారం మృదువైనది అయినప్పటికీ, దానితో ఆభరణాలుగా  తయారు చేయడం సాధ్యం కాదు.

Follow Us:
Download App:
  • android
  • ios