పసిడి ధరలకు బ్రేకులు.. నేడు స్థిరంగా బంగారం, వెండి.. 10 గ్రాముల ధర ఎంతంటే..?
నేడు సోమవారం ప్రారంభ ట్రేడింగ్‌లో బంగారం, వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.57,160 వద్ద ట్రేడవుతుండగా, వెండి కిలో రూ.71,200గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 52,930.

ప్రతికూల అంతర్జాతీయ సంకేతాలు ఉన్నప్పటికీ బంగారం ధర సోమవారం అధికంగా ట్రేడవుతోంది, వెండి ధర కూడా 0.12% పెరిగింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో, గోల్డ్ ఏప్రిల్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ. 302 లేదా 0.53% పెరిగి రూ.56,887 వద్ద ట్రేడవుతున్నాయి. ఎంసీఎక్స్‌లో సిల్వర్ మార్చి ఫ్యూచర్స్ రూ.302 పెరిగి కిలో రూ.67,696 వద్ద ట్రేడవుతున్నాయి.
నేడు సోమవారం ప్రారంభ ట్రేడింగ్‌లో బంగారం, వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.57,160 వద్ద ట్రేడవుతుండగా, వెండి కిలో రూ.71,200గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 52,930.
ఇండియాలోని ప్రముఖ నగరాలలో బంగారం ధరలకు స్థిరంగా ఉన్నాయి. ఈరోజు చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,285 కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,927గా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,080 కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 53,250. కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,930 కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 53,100. మరోవైపు ముంబైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.57,930 కాగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.53,100గా ఉంది.
భువనేశ్వర్‌లో ఈ రోజు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 57,930 కాగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 53,100. హైదరాబాద్‌లలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,160, 22 క్యారెట్ల పసిడి ధర రూ.52,400గా ఉంది.
0045 GMT నాటికి స్పాట్ గోల్డ్ ఔన్సుకు $1,865.88 డాలర్ల వద్ద, US గోల్డ్ ఫ్యూచర్స్ 0.2% పెరిగి $1,879.40 డాలర్లకి చేరుకుంది. ఢిల్లీ, కోల్‌కతా, ముంబైలలో 1 కేజీ వెండి ధర రూ.71,200 వద్ద ట్రేడవుతుండగా, చెన్నై, హైదరాబాద్‌లలో రూ.74,200గా ఉంది.
స్పాట్ వెండి ఔన్స్‌కు 0.4 శాతం పెరిగి 23.65 డాలర్లకు, ప్లాటినం 0.2 శాతం పెరిగి 1,014.53 డాలర్లకు, పల్లాడియం 1.2 శాతం పెరిగి 1,638.45 డాలర్లకు చేరుకుంది.