ఈరోజు నవంబర్ 10 గురువారం ఉదయం దేశంలో 1 గ్రాము (24 క్యారెట్) బంగారం ధర  రూ.5,167గా నమోదైంది. బెంగళూరులో 1 గ్రాము (24 క్యారెట్) బంగారం రూ.5,110గా ఉంది. 

న్యూఢిల్లీ: మహిళలకు బంగారం అంటే చాలా ఇష్టం. బంగారం కొనే వారికే మాత్రమే కాదు ప్రతి ఒక్కరికీ బంగారం ధర ఎంత ఉందో తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. గత వారం నుంచి బంగారం, వెండి ధరల్లో అస్థిరత కనిపిస్తోంది. ఒక్కోసారి బంగారం ధర పెరగగా, ఒక్కోసారి తగ్గుతూ వస్తోంది. ఇండియాలోని ప్రముఖ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

ఈరోజు నవంబర్ 10 గురువారం ఉదయం దేశంలో 1 గ్రాము (24 క్యారెట్) బంగారం ధర రూ.5,167గా నమోదైంది. బెంగళూరులో 1 గ్రాము (24 క్యారెట్) బంగారం రూ.5,110గా ఉంది. బెంగళూరులో 10 గ్రాముల (22 క్యారెట్లు) బంగారం రూ.47,410గా ఉంది. బెంగళూరులో 10 గ్రాముల బంగారం (24 క్యారెట్లు) ధర రూ.51,100గా నమోదైంది.

ప్రముఖ నగరాల్లో ఈరోజు 10 గ్రాముల బంగారం ధర :

బెంగళూరు: రూ.47,410 (22 క్యారెట్) - రూ51,100 (24 క్యారెట్)
చెన్నై: రూ48,150 (22 క్యారెట్) - రూ52,530 (24 క్యారెట్)
ఢిల్లీ: రూ47,460 (22 క్యారెట్) - రూ51,770 (24 క్యారెట్)
హైదరాబాద్: రూ47,360 (22 క్యారెట్) - రూ51,670 (24 క్యారెట్)
కోల్‌కతా: రూ47,360 (22 క్యారెట్) - రూ51,670 (24 క్యారెట్)
మంగళూరు: రూ.47,410 24 క్యారెట్) 22 క్యారెట్) - రూ.51,100 (24 క్యారెట్)
ముంబై: రూ.47,410 (22 క్యారెట్) - రూ.51,100 (24 క్యారెట్)
మైసూర్: రూ.47,410 (22 క్యారెట్) - రూ.51,100 (24 క్యారెట్) 

వెండి ధర 
కర్నాటకలో వెండి ధర కిలోకి రూ.61,700 నమోదైంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.67,400 చేరింది. దేశవ్యాప్తంగా పలుచోట్ల వెండి ధరలు పెరగగా, కొన్ని చోట్ల తగ్గాయి. చెన్నై, హైదరాబాద్, కేరళ, కోయంబత్తూర్, మైసూర్, మంగళూరులో రూ.67,400గా ఉంది. అంతర్జాతీయ ట్రెండ్, బంగారంపై దిగుమతి సుంకం, డాలర్‌తో రూపాయి విలువ ఆధారంగా ప్రతిరోజు బంగారం, వెండి ధరలు మారుతుంటాయి. 

బంగారం స్వచ్ఛత తెలుసుకోవడం ఎలా?
బంగారం స్వచ్ఛతను గుర్తించడానికి ISO (ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్) ద్వారా హాల్ మార్కులు ఇస్తారు. 24 క్యారెట్లపై 999, 23 క్యారెట్లపై 958, 22 క్యారెట్లపై 916, 21 క్యారెట్లపై 875, 18 క్యారెట్లపై 750 ఉంటుంది. చాలా వరకు బంగారాన్ని 22 క్యారెట్లలో విక్రయిస్తుండగా, కొందరు 18 క్యారెట్లను కూడా ఉపయోగిస్తున్నారు. క్యారెట్ ఎంత ఎక్కువ ఉంటే బంగారం అంత స్వచ్ఛంగా ఉంటుందని చెబుతారు. 

22 అండ్ 24 క్యారెట్ల మధ్య తేడా ఏమిటి?
24 క్యారెట్ల బంగారం 99.9% స్వచ్ఛమైనది, 22 క్యారెట్ దాదాపు 91% స్వచ్ఛమైనది. 22 క్యారెట్ల బంగారంలో 9% రాగి, వెండి, జింక్ వంటి ఇతర లోహాలతో కలిపి ఆభరణాలు తయారు చేస్తారు. 24 క్యారెట్ల బంగారం స్వచ్ఛమైనది అయినప్పటికీ దానితో ఆభరణాలుగా తయారు చేయడం సాధ్యం కాదు. కాబట్టి చాలా మంది దుకాణదారులు బంగారాన్ని 22 క్యారెట్లలో విక్రయిస్తారు.