Asianet News TeluguAsianet News Telugu

కొత్త ఏడాదికి ముందే పసిడి ప్రియులకు చుక్కలు.. భారీగా పెరిగిన బంగారం, వెండి.. నేడు తులం ధర ఎంతంటే..?

నేడు బంగారం ధర రూ.330 పెరిగి, 10 గ్రాముల పసిడి 24 క్యారెట్ల ధర రూ.54,930 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు వెండి ధరలు నిన్నటి ముగింపుతో పోలిస్తే రూ. 1000 పెరగ్గా,  కిలో ధర రూ.71,300కి చేరింది.
 

Gold Silver Price on december 31: Rise in gold and silver on last day of year know today's rate here
Author
First Published Dec 31, 2022, 9:59 AM IST

బంగారం, వెండి  కొనాలనుకునేవారికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత కొద్దిరోజులుగా అస్థిరంగా ఉన్న పసిడి ధరలు ఈ ఏడాది చివరి రోజున మళ్ళీ ఎగిశాయి. ఇంకో  విషయం ఏంటంటే.. వచ్చే సంవత్సరం  అంటే 2023 నుండి కూడా బంగారం, వెండి ధరలు భారీగా పెరగనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు.

నేడు బంగారం ధర రూ.330 పెరిగి, 10 గ్రాముల పసిడి 24 క్యారెట్ల ధర రూ.54,930 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు వెండి ధరలు నిన్నటి ముగింపుతో పోలిస్తే రూ. 1000 పెరగ్గా,  కిలో ధర రూ.71,300కి చేరింది.

ఒక నివేదిక ప్రకారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్నటి ధర నుండి రూ.300 పెరిగి రూ.50,350కి చేరుకుంది. ముంబై, కోల్‌కతా అండ్ హైదరాబాద్‌లలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 55,790,  22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 51,140 వద్ద ఉంది.

ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 55,080,  22 క్యారెట్ల  10 గ్రాముల ధర రూ. 50,500 వద్ద ట్రేడవుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,580, , 22 క్యారెట్ల 10 గ్రాముల ధర  రూ.50,950గా ఉంది.

ఈ ఏడాది 2022  చివరి ట్రేడింగ్ రోజున 2:17 pm ET (1858 GMT) సమయానికి స్పాట్ బంగారం 0.2 శాతం పెరిగి ఔన్స్‌కు $1,818.70డాలర్లకి చేరుకుంది, అయితే US గోల్డ్ ఫ్యూచర్స్ మారకుండా $1,826.2 డాలర్ల వద్ద స్థిరపడ్డాయి. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.69 వద్ద కొనసాగుతోంది.

ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో ప్రస్తుతం 1 కిలో వెండి ధర రూ.71,300 వద్ద ట్రేడవుతోంది. నిజానికి ఎక్సైజ్ సుంకం మరియు మేకింగ్ ఛార్జీ కారణంగా, బంగారం మరియు వెండి ధరలు మారుతూ ఉంటాయి. అలాగే వెండి విషయానికి వస్తే హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.500 పెరిగి ప్రస్తుతం రూ.74,500కు చేరింది. 


ఇండియాలోని ప్రముఖ నగరాల్లో బంగారం, వెండి ధరల అప్ డేట్
నగరం          22క్యారెట్     24క్యారెట్    వెండి కేజీ ధర
చెన్నై           రూ. 51140    రూ. 55790    రూ. 74500
ముంబై        రూ. 50350    రూ. 54930    రూ. 71300
ఢిల్లీ             రూ. 50500    రూ. 55080    రూ. 71300
కోల్‌కతా       రూ. 50350    రూ. 54930    రూ. 54930
బెంగళూరు  రూ. 50400    రూ. 54980    రూ. 74500
హైదరాబాద్     రూ. 50350    రూ. 54930    రూ. 74500
అహ్మదాబాద్    రూ. 50400    రూ. 54980    రూ. 71300
సూరత్        రూ. 50400    రూ. 54980    రూ. 71300
నాగపూర్     రూ. 50350    రూ. 54930    రూ. 71300
పూణే           రూ. 50350    రూ. 54930    రూ. 71300
భువనేశ్వర్      రూ. 50350    రూ. 54930    రూ. 74500
చండీగఢ్    రూ. 50500    రూ. 55080    రూ. 71300
జైపూర్        రూ. 50500    రూ. 55080    రూ. 71300
లక్నో         రూ. 50500    రూ. 55080    రూ. 71300
పాట్నా       రూ. 50400    రూ. 54980    రూ. 71300

మీరు బంగారం స్వచ్ఛతను చెక్ చేయాలనుకుంటే.. ఇందు కోసం ప్రభుత్వం ఒక యాప్‌ను రూపొందించింది. కస్టమర్లు BIS కేర్ యాప్‌ని ఉపయోగించి బంగారం స్వచ్ఛతను చెక్ చేయవచ్చు. మీరు బంగారం స్వచ్ఛతను చెక్ చేయడమే కాకుండా, దానికి సంబంధించి ఫిర్యాదులు చేయడానికి కూడా ఈ యాప్‌ని ఉపయోగించవచ్చు.

Follow Us:
Download App:
  • android
  • ios