నేడు బంగారం ధరలలో పెద్దగా మార్పులేదు. సోమవారం (అక్టోబర్ 31) నాటికి భారతదేశంలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) బంగారం ధర రూ. 50,500 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ.46,260.   

దసరా, నవరాత్రి, కర్వా చౌత్, ధంతేరాస్, దీపావళి, ఛత్‌తో సహా పెద్ద పండుగలు అన్నీ ముగిశాయి, ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుంది. మీరు కూడా బంగారం, వెండి ఆభరణాలను కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే మీకు గుడ్ న్యూస్.

నేడు బంగారం ధరలలో పెద్దగా మార్పులేదు. సోమవారం (అక్టోబర్ 31) నాటికి భారతదేశంలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) బంగారం ధర రూ. 50,500 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ.46,260.

సిటీ 22-క్యారెట్ 24-క్యారెట్
చెన్నై రూ.47,050 రూ.51,330
ముంబై రూ.47,750 రూ.51,000
ఢిల్లీ రూ.46,900 రూ.51,160
కోల్‌కతా రూ.46,750 రూ.51,000
బెంగళూరు రూ.46,800 రూ.51,050
హైదరాబాద్ రూ.46,750 రూ.51,000
నాసిక్ రూ.46,780 రూ.51,030
పూణే రూ.46,780 రూ.51,030
వడోదర రూ.46,780 రూ.51,030
అహ్మదాబాద్ రూ.46,800 రూ.51,050
లక్నో రూ.46,900 రూ.51,160
చండీగఢ్ రూ.46,900 రూ.51,160
సూరత్ రూ.46,800 రూ.51,050
విశాఖపట్నం రూ.46,750 రూ.51,000
భువనేశ్వర్ రూ.46,750 రూ.51,000
మైసూర్ రూ.46,800 రూ.51,050


 మీరు ఇప్పుడు బంగారం స్వచ్ఛతను చెక్ చేయాలనుకుంటే దీని కోసం ప్రభుత్వం ఒక యాప్‌ను రూపొందించింది. BIS కేర్ యాప్‌తో కస్టమర్లు బంగారం స్వచ్ఛతను చెక్ చేయవచ్చు. ఈ యాప్ ద్వారా బంగారం స్వచ్ఛతను చెక్ చేయడమే కాకుండా దానికి సంబంధించిన ఎలాంటి ఫిర్యాదునైనా చేయవచ్చు.

 24 క్యారెట్ల బంగారాన్ని స్వచ్ఛమైనదిగా పరిగణిస్తాం, అయితే ఈ బంగారంతో నగలు తయారు చేయలేము ఎందుకంటే ఇది చాలా మృదువైనది. అందువల్ల 22 క్యారెట్ల బంగారాన్ని ఎక్కువగా ఆభరణాలు లేదా ఆభరణాల తయారీలో ఉపయోగిస్తారు. 24 క్యారెట్ల బంగారం 99.9 శాతం, 22 క్యారెట్ 91 శాతం స్వచ్ఛమైనది.

22 క్యారెట్ల బంగారంలో 9% రాగి, వెండి, జింక్ వంటి ఇతర లోహాలు కలపడం ద్వారా ఆభరణాలు తయారు చేస్తారు. బంగారాన్ని కొనుగోలు చేసేటప్పుడు కస్టమర్లు నాణ్యతను జాగ్రత్తగా చూసుకోవాలి. హాల్‌మార్క్ చూసిన తర్వాతే బంగారు ఆభరణాలను కొనుగోలు చేయాలి.

బంగారం స్వచ్ఛతను గుర్తించేందుకు ISO ద్వారా హాల్ మార్కులు ఇస్తారు. 24 క్యారెట్ల బంగారంపై 999, 23 క్యారెట్‌పై 958, 22 క్యారెట్‌పై 916, 21 క్యారెట్‌పై 875, 18 క్యారెట్‌పై 750 ఉంటుంది. చాలా వరకు బంగారం 22 క్యారెట్లలో అమ్ముడవుతుండగా, కొందరు 18 క్యారెట్లను కూడా ఉపయోగిస్తున్నారు.

22 అండ్ 24 క్యారెట్ల బంగారం మధ్య తేడా ఏమిటో తెలుసా?
24 క్యారెట్ల బంగారం 99.9 శాతం స్వచ్ఛమైనది, 22 క్యారెట్ 91 శాతం స్వచ్ఛమైనది. 22 క్యారెట్ల బంగారంలో 9% రాగి, వెండి, జింక్ వంటి ఇతర లోహాలను కలపడం ద్వారా ఆభరణాలను తయారు చేస్తారు.

పైన లిస్ట్ లో పేర్కొన్న ధరలు స్థానిక ధరలకు సమానంగా ఉండకపోవచ్చు. ఈ ధరలు TDS, GST అండ్ ఇతర పన్నులను చేర్చకుండా చూపుతుంది. అలాగే భారతదేశంలోని వివిధ నగరాల్లో ప్రతి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం, 24-క్యారెట్ల బంగారం ధరలకి చెందినవి.