Asianet News TeluguAsianet News Telugu

బంగారం కొనేందుకు గోల్డెన్ టైమ్! పడిపోతున్న పసిడి.. నేటి ధరలు తెలుసుకోండి..

గత 24 గంటల్లో భారతదేశంలోని వివిధ మెట్రో నగరాల్లో పసిడి ధరల్లో మార్పు కనిపించింది. ఈరోజు చెన్నైలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.52,285 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ.47,927గా ఉంది.

Gold rates today in Hyderabad Bangalore Kerala Visakhapatnam on 09 November 2022 know here
Author
First Published Nov 9, 2022, 10:12 AM IST

నేడు 09 నవంబర్ 2022న హైదరాబాద్, బెంగళూరు, కేరళ, విశాఖపట్నంలలో బంగారం ధరలు తగ్గాయి. బెంగళూరు నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 పతనంతో రూ. 46,800కి, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 110 పతనంతో  రూ. 51,050 చేరింది. హైదరాబాద్‌లో బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 100 పతనంతో రూ. 46,800 వద్ద, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 110 పతనంతో రూ. 51,050గా ఉంది.

కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,800, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,050. విశాఖపట్నంలో బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 46,800, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,050. మరోవైపు హైదరాబాద్, కేరళ, బెంగళూరు, విశాఖపట్నంలలో కిలో వెండి ధర రూ. 66,700గా ఉంది. 

గత 24 గంటల్లో భారతదేశంలోని వివిధ మెట్రో నగరాల్లో పసిడి ధరల్లో మార్పు కనిపించింది. ఈరోజు చెన్నైలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.52,285 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ.47,927గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.51,200 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ.46,950. కోల్‌కతాలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 51,050 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ. 46,800. మరోవైపు ముంబైలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.51,050 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.46,800గా ఉంది.


ఇక్కడ పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 8 గంటలకు చెందినవి అలాగే ప్రతిరోజూ మారుతూ ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్ కరెన్సీ ధరలలో మార్పు, ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, ఆభరణాల మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు  అనేక ఇతర కారణాల వల్ల బంగారం ధరలో హెచ్చుతగ్గులకు కారణాలు అని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అలాగే చాలా అంశాలు బంగారం ధరపై ప్రభావం చూపుతాయని చెబుతున్నారు.  


బంగారం స్వచ్ఛత తెలుసుకోవడం ఎలా?

బంగారం స్వచ్ఛతను గుర్తించడానికి ISO (ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్) ద్వారా హాల్ మార్కులు ఇస్తారు. 24 క్యారెట్లపై 999, 23 క్యారెట్లపై 958, 22 క్యారెట్లపై 916, 21 క్యారెట్లపై 875, 18 క్యారెట్లపై 750 ఉంటుంది. చాలా వరకు బంగారాన్ని 22 క్యారెట్లలో విక్రయిస్తుండగా, కొందరు 18 క్యారెట్లను కూడా ఉపయోగిస్తున్నారు. క్యారెట్ ఎంత ఎక్కువ ఉంటే బంగారం అంత స్వచ్ఛంగా ఉంటుందని చెబుతారు.


22 అండ్ 24 క్యారెట్ల మధ్య తేడా ఏమిటి?

24 క్యారెట్ల బంగారం 99.9% స్వచ్ఛమైనది, 22 క్యారెట్ దాదాపు 91% స్వచ్ఛమైనది. 22 క్యారెట్ల బంగారాన్ని 9% రాగి, వెండి, జింక్ వంటి ఇతర లోహాలతో కలిపి ఆభరణాలు తయారు చేస్తారు.  బంగారం కొనుగోలు చేసేటప్పుడు దాని నాణ్యతను పరిగణనలోకి తీసుకోవాలి. హాల్‌మార్క్  గుర్తును చూసిన తర్వాత మాత్రమే కొనుగోలు చేయాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios