Asianet News TeluguAsianet News Telugu

సంక్రాంతి ముందు బంగారం, వెండి కొనేందుకు మంచి ఛాన్స్.. వరుసగా 2వ రోజు దిగోస్తున్న ధరలు.. ఎంత తగ్గిందంటే..?

ఈరోజు అంటే జనవరి 12న  హైదరాబాద్, బెంగళూరు, కేరళ, విశాఖపట్నంలలో బంగారం ధరలు వరుసగా రెండో రోజు తగ్గాయి.ఇటీవలి కాలంలో బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయని, భారత రూపాయి బలహీనపడడమే ఇందుకు కారణమని నిపుణులు పేర్కొంటున్నారు.

Gold rates today in Hyderabad Bangalore Kerala and Visakhapatnam fall for second consecutive day
Author
First Published Jan 12, 2023, 11:05 AM IST

బంగారం, వెండి ప్రియులకి అలాగే కొనేందుకు ఆలోచిస్తున్నవారికి గుడ్ న్యూస్. నేడు ఢిల్లీ చెన్నై, కోల్‌కతా, ముంబైలలో బంగారం ధరలు దిగోచ్చాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 160 పతనంతో రూ. 51,440 , 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.180 పతనంతో రూ.56,100 వద్ద ఉంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.80  తగ్గడంతో రూ. 52,290గా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం ధర రూ. 90 పతనంతో  రూ. 57,040గా ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 55,960. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,300, రూ. 24 క్యారెట్ల 10 గ్రాములకు 55,960. వెండి ధరలు కేజీకి  కోల్‌కతా, ముంబైలలో రూ.71,500, చెన్నైలో కేజీ వెండి ధర రూ. 74,000.

ఈరోజు అంటే జనవరి 12న  హైదరాబాద్, బెంగళూరు, కేరళ, విశాఖపట్నంలలో బంగారం ధరలు వరుసగా రెండో రోజు తగ్గాయి.ఇటీవలి కాలంలో బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయని, భారత రూపాయి బలహీనపడడమే ఇందుకు కారణమని నిపుణులు పేర్కొంటున్నారు.

అయితే, బుధవారం ప్రధాన నగరాల్లో పసుపు లోహం ధరల ప్రకారం. బెంగళూరు నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 51,300 పతనంతో రూ. 150 మరియు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,960 పతనంతో రూ. 170.

0011 GMT నాటికి స్పాట్ బంగారం ఔన్సుకు $1,876.93 డాలర్ల వద్ద స్థిరపడింది. US గోల్డ్ ఫ్యూచర్స్ 0.1% పెరిగి $1,879.80 డాలర్లకి చేరుకుంది. స్పాట్ సిల్వర్ 0.1% పెరిగి $23.44డాలర్లకి, ప్లాటినం 0.1% తగ్గి $1,069.47డాలర్లకి, పల్లాడియం 0.1% పడిపోయి $1,772.48డాలర్లకి చేరుకుంది.

బంగారం ధరలు
నేడు హైదరాబాద్‌లో బంగారం ధరలు  చూస్తే 22 క్యారెట్ల 10 గ్రాములకు  రూ.150 తగ్గి  రూ. 51,300 చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ. 170 పడిపోయి రూ. 55,960గా ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,300, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,960.

విశాఖపట్నంలో బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 51,300, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,960. మరోవైపు హైదరాబాద్, కేరళ, బెంగళూరు, విశాఖపట్నంలలో కిలో వెండి ధర రూ. 74,000.

ఇక్కడ పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 8 గంటలకు చెందినవి అలాగే ప్రతిరోజూ మారుతూ ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్ కరెన్సీ ధరలలో మార్పు, ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, ఆభరణాల మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు అనేక ఇతర కారణాలు బంగారం ధరలో హెచ్చుతగ్గులకు కారణాలు అని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios