పండగకి బంగారం కొంటున్నారా.. నేడు పెరిగిన బంగారం ధరలు.. 24క్యారెట్ల తులం ధర ఎంతంటే..?
జనవరి 13 నాటికి 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 56,100 కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 51,380గా ఉంది. అయితే బంగారం ధర రెండేళ్ల గరిష్టాన్ని కూడా తాకింది. నేడు హైదరాబాద్, బెంగళూరు, కేరళ ఇంకా విశాఖపట్నంలలో బంగారం ధరలు పెరిగాయి

గత కొద్దిరోజులుగా పడిపోతున్న పసిడి ధరలు నేడు ఎగిశాయి. దీంతో భారతదేశంలోని ప్రముఖ మెట్రో నగరాలలో నేడు బంగారం ధరలలో మార్పులను నమోదు చేశాయి. జనవరి 13 నాటికి 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 56,100 కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 51,380గా ఉంది. అయితే బంగారం ధర రెండేళ్ల గరిష్టాన్ని కూడా తాకింది.
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,220 కాగా, 22 క్యారెట్లు 10 గ్రాముల ధర రూ. 51,550. ఈరోజు చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,285 కాగా, 22 క్యారెట్లు 10 గ్రాముల ధర రూ.47,927గా ఉంది. కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,270 కాగా, 22 క్యారెట్లు 10 గ్రాముల ధర రూ. 51,400. మరోవైపు ముంబైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.56,070 కాగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.51,400గా ఉంది.
0045 GMT నాటికి స్పాట్ బంగారం 0.1% పెరిగి ఔన్సుకు $1,897.92 వద్ద ఉంది. ఈ వారంలో ఇప్పటివరకు ధరలు 1.7% లాభపడ్డాయి. US గోల్డ్ ఫ్యూచర్స్ GCv1 0.2% పెరిగి $1,901.80కి చేరుకుంది.
SPDR గోల్డ్ ట్రస్ట్ GLD, ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్-బ్యాక్డ్ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్ దాని హోల్డింగ్స్ గురువారం 0.03% పడిపోయి 912.14 టన్నులకు చేరుకుంది.
స్పాట్ సిల్వర్ 0.2% పెరిగి $23.82డాలర్లకి, ప్లాటినం 0.4% లాభపడి $1,071.74డాలర్లకి, పల్లాడియం 0.6% పడిపోయి $1,782.13డాలర్లకి చేరుకుంది.
నేడు హైదరాబాద్, బెంగళూరు, కేరళ ఇంకా విశాఖపట్నంలలో బంగారం ధరలు పెరిగాయి, మరోవైపు వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. గత కొద్దిరీజులుగా బంగారం ధరలు అస్థిరంగా ఉండడం భారత రూపాయి బలహీనపడడమే ఇందుకు కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, ప్రముఖ నగరాల్లో ఈ రోజు పసిడి ధరలు చూస్తే బెంగళూరు నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 పెంపుతో రూ. 51,400 , 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 110 పెంపుతో రూ. 56,070.
ఇక హైదరాబాద్‌లో బంగారం ధరలు చూస్తే 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ. 100 పెంపుతో రూ. 51,400, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 110 పెంపుతో రూ. 56,070. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,400, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,070. విశాఖపట్నంలో బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 51,400, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,070. మరోవైపు హైదరాబాద్, కేరళ, బెంగళూరు, విశాఖపట్నంలలో కిలో వెండి ధర రూ. 74,000గా ఉంది.