ముంబై బులియన్ మార్కెట్లో బంగారం ధరలు 10 గ్రాములకి 421 రూపాయలకు పెరిగి 51,124 రూపాయలకు చేరుకున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ తగ్గడం, అమెరికా, చైనా మధ్య సంబంధాలు క్షీణిస్తున్నందున బంగారం ధరల పెరగడానికి సహకరించాయి.

 ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి కారణంగా బంగారం ధర బలపడినట్లు బులియన్‌ విశ్లేషకులు భావిస్తున్నారు. అధిక ధరల కారణంగా రిటైల్ డిమాండ్ లేనప్పటికీ, బులియన్ మెటల్(బంగారం, వెండి ఇతర లోహాలు) ఈ వారంలో rs. 1,979 అంటే 4.02 శాతం పెరిగింది.

ఈ వారంలో బుధవారం తొలిసారి రూ.50వేల స్థాయిని అందుకుంది. కొనుగోళ్ల మద్దతు మరింత పెరగడంతో రూ.51,184 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని తాకింది. ఈ వారం మొత్తం మీద బంగారం ధర రూ.2068(4.22శాతం) లాభపడింది.

also read రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఎస్‌బిఐ గుడ్ న్యూస్... ...

ముంబైలో 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.38,343, 22 క్యారెట్లకు  రూ .46,830, 24 క్యారెట్ల బంగారం ధర రూ .51,124 దీనికి అదనంగా 3 శాతం జీఎస్టీ. జూలై 23న వెండి ధరలు కిలోకు రూ.900 తగ్గి 59,885 రూపాయలకు చేరుకున్నాయి.

వైట్ మెటల్ ఈ వారంలో బంగారాన్ని 8,145 రూపాయలు లేదా 15.74 శాతం అధిగమించింది. ఫ్యూచర్స్ మార్కెట్లో మల్టీ-కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసిఎక్స్) లో బంగారం గరిష్టంగా రూ .50,948ను తాకింది. వచ్చేవారంలోనూ బంగారం ధర రూ.52వేల స్థాయిని అందుకుంటుందని క్వాంటమ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ అధికారి చిరాగ్‌ మెహతా అభిప్రాయపడ్డారు.