శ్రావణమాసంలో బంగారం, వెండి ధరలు మళ్లీ పైపైకి.. డిమాండ్ పెరుగుతుండడంతో రానున్న రోజులో ఎంత పెరగవచ్చంటే..?
0123 GMT నాటికి స్పాట్ బంగారం 0.2% పెరిగి ఔన్సుకు $1,900.30 వద్ద ఉండగా, US గోల్డ్ ఫ్యూచర్స్ 0.2% పెరిగి $1,929.40కి చేరుకుంది. భరత రూపాయి డాలర్‌తో పోలిస్తే మరింత పడిపోయి ప్రస్తుతం రూ. 83.103 వద్ద ఉంది.
పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ వచ్చేసింది. దింతో మళ్ళీ బంగారం, వెండి షాపులకు కొనుగోలుదారుల తాకిడి మొదలవుతుంది. శ్రావణ మాసం కావడంతో గత రెండు రోజుల్లో పసిడి ధర రూ.100 పైనే పెరిగింది.
నేడు భారత్‌లో బంగారం ధరలు మంగళవారం మళ్ళీ పెరిగాయి. 22 ఆగస్టు 2023 నాటికి 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 58,660 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ. 53,730.
దేశంలోని ముఖ్యమైన నగరాల్లో కూడా బంగారం ధరల్లో మార్పులు నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 59,220 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) ధర రూ. 54,300. కోల్‌కతాలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 59,130 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు)ధర రూ. 54,200.
మరోవైపు ముంబైలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.59,120 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.54,200గా ఉంది. ఈరోజు చెన్నైలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.52,385గా ఉండగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) ధర రూ.47,927గా ఉంది.
భువనేశ్వర్‌లో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.59,130 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.54,200.
* 0123 GMT నాటికి స్పాట్ బంగారం 0.2% పెరిగి ఔన్సుకు $1,900.30 వద్ద ఉండగా, US గోల్డ్ ఫ్యూచర్స్ 0.2% పెరిగి $1,929.40కి చేరుకుంది.
* SPDR గోల్డ్ ట్రస్ట్, ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్-బ్యాక్డ్ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్, దాని హోల్డింగ్స్ మంగళవారం 0.5% పడిపోయాయి.
* ఇతర లోహాలలో స్పాట్ వెండి ఔన్స్‌కు 0.5% పెరిగి $23.50కి, ప్లాటినం 0.4% పెరిగి $922.53కి చేరుకుంది. పల్లాడియం 0.2% పెరిగి $1,262.63 వద్ద ఉంది.
*భరత రూపాయి డాలర్‌తో పోలిస్తే మరింత పడిపోయి ప్రస్తుతం రూ. 83.103 వద్ద ఉంది.
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో నేడు పసిడి ధర పెరిగింది. దింతో ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.50 పెరిగి రూ. 54,200 వద్ద ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 60 పెరిగి రూ. 59,130 మార్క్ వద్ద ట్రేడవుతోంది.
వెండి ధర
వెండి ధరలు మరోసారి షాక్ ఇచ్చాయి. ఈ రోజు ఒక్కరోజే కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్లో రూ. 1500 పెరిగింది. దింతో కిలో వెండి ధర రూ. 78,000కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 74,800 మార్క్ వద్ద ట్రేడవుతోంది.