Asianet News TeluguAsianet News Telugu

స్వల్పంగా తగ్గిన బంగారం ధర

స్థానిక ఆభరణాల తయారీదారుల దగ్గర నుంచి కొనుగోళ్లు మందగించడం కూడా పసిడి ధర పడిపోవడంపై ప్రభావం చూపినట్లు బులియన్‌ మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి.

Gold Rates Edge Lower On Weak Global Cues: 5 Things To Know
Author
Hyderabad, First Published Oct 9, 2018, 4:48 PM IST


మొన్నటి వరకు భారీగా పెరిగిన బంగారం ధర రెండు రోజులుగా తగ్గుతూ వస్తోంది. రూపాయి పతనం, అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల కారణంగా పుత్తడి ధర వరుసగా రెండో రోజు తగ్గింది. మంగళవారం రూ.220 తగ్గడంతో పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.31,650కి చేరింది. స్థానిక ఆభరణాల తయారీదారుల దగ్గర నుంచి కొనుగోళ్లు మందగించడం కూడా పసిడి ధర పడిపోవడంపై ప్రభావం చూపినట్లు బులియన్‌ మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి.

బంగారం బాటలోనే వెండి పయనించింది. రూ.50 తగ్గడంతో కిలో వెండి రూ.39,250కి చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణెల తయారీదారుల దగ్గర నుంచి ఆశించిన స్థాయిలో కొనుగోళ్లు లేకపోవడంతో వెండి ధర తగ్గినట్లు ట్రేడర్లు చెబుతున్నారు. ఇక అంతర్జాతీయ మార్కెట్లలోను బంగారం, వెండి ధరలు పతనమయ్యాయి. న్యూయార్క్‌ మార్కెట్లో బంగారం ధర 1.39శాతం తగ్గి ఔన్సు 1,187 డాలర్లు పలికింది. వెండి కూడా 2.39శాతం తగ్గి ఔన్సు 14.38డాలర్లు పలికింది.

Follow Us:
Download App:
  • android
  • ios