24 క్యారెట్ల బంగారం 99.9% స్వచ్ఛమైనది, 22 క్యారెట్ దాదాపు 91% స్వచ్ఛమైనది. 22 క్యారెట్ల బంగారానికి 9% రాగి, వెండి, జింక్ వంటి ఇతర లోహాలతో కలిపి ఆభరణాలు తయారు చేస్తారు.
గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు మారుతూ వస్తున్నాయి. శుక్రవారం కూడా పసిడి ధర ఎగిసింది. ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,740, 24 క్యారెట్ల ధర రూ.53,170గా ఉంది.
కొన్ని ప్రముఖ నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర
చెన్నై - రూ. 54,000
ఢిల్లీ - రూ. 53,340
హైదరాబాద్ - రూ.53,170
కోల్‌కతా - రూ. 53,170
లక్నో - రూ. 53,340
ముంబై - రూ. 53,170
నాగ్‌పూర్ - రూ.53,200
పూణే - రూ. 53,200
బంగారం స్వచ్ఛత తెలుసుకోవడం ఎలా?
బంగారం స్వచ్ఛతను గుర్తించడానికి ISO (ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్) ద్వారా హాల్ మార్కులు ఇస్తారు. 24 క్యారెట్లపై 999, 23 క్యారెట్లపై 958, 22 క్యారెట్లపై 916, 21 క్యారెట్లపై 875, 18 క్యారెట్లపై 750 ఉంటుంది. చాలా వరకు బంగారాన్ని 22 క్యారెట్లలో విక్రయిస్తుండగా, కొందరు 18 క్యారెట్లను కూడా ఉపయోగిస్తారు. క్యారెట్ ఎంత ఎక్కువ ఉంటే బంగారం అంత స్వచ్ఛంగా ఉంటుందని చెబుతారు.
22 అండ్ 24 క్యారెట్ల మధ్య తేడా ఏమిటి?
24 క్యారెట్ల బంగారం 99.9% స్వచ్ఛమైనది, 22 క్యారెట్ దాదాపు 91% స్వచ్ఛమైనది. 22 క్యారెట్ల బంగారానికి 9% రాగి, వెండి, జింక్ వంటి ఇతర లోహాలతో కలిపి ఆభరణాలు తయారు చేస్తారు.
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు $1751 డాలర్ల వద్ద, స్పాట్ సిల్వర్ ఔన్సుకు $20.97 డాలర్ల వద్ద ఉంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.81.66 వద్ద కొనసాగుతోంది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.10 తగ్గి రూ.48,740 వద్ద ఉంది. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ.53,170కి చేరింది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర ప్రస్తుతం రూ.67,000 వద్ద ఉంది.
