బంగారం, వెండి ధరలు నేడు మరోసారి పడిపోయాయి. ఎం‌సి‌ఎక్స్   అక్టోబర్ బంగారు ఫ్యూచర్స్ లో 10 గ్రాముల బంగారం ధర 1.2% తగ్గి  రూ.49,764 కు చేరుకోగా, వెండి ఫ్యూచర్స్ 4% పడిపోయి కిలో వెండి ధర రూ.58,851 చేరుకుంది.

అంతకుముందు బంగారం ధర సోమవారం 1,200 తగ్గింది. మంగళవారం వెండి ధరలు కూడా తగ్గటంతో రూ.6,000 దిగోచ్చింది. గత నెలలో బంగారం ధర అత్యధికంగా రూ.56,200 తాకీ, ఇప్పుడు భారతదేశంలో బంగారం 10 గ్రాములకి 6 వేలు తగ్గింది.

also read రిలయన్స్‌ రిటైల్‌లో 1.28% వాటా విక్రయం.. రూ. 5,550 కోట్లుకు డీల్.. ...

బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణం డాలర్ సూచి, అమెరికా ప్రభుత్వం తదుపరి ఉద్దీపన ప్యాకేజీపై అనిశ్చితి. ఇతర కరెన్సీలతో పోలిస్తే డాలర్ సూచీ 8 వారాల గరిష్ట స్థాయికి చేరుకుంది ”అని నిష్ భట్ చెప్పారు.

ఐరోపాలో కరోనావైరస్ సంక్షోభం సెంటిమెంట్‌తో డాలర్ బలపడటంతో ప్రపంచ మార్కెట్లలో, బంగారం ధరలు నేడు ఆరు వారాల కనిష్టానికి చేరుకున్నాయి.

ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు-మద్దతు గల ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్ అయిన ఎస్పీడిఆర్ గోల్డ్ ట్రస్ట్‌లోని ఇటిఎఫ్ హోల్డింగ్స్ మంగళవారం 0.05 శాతం పడిపోయి 1,278.23 టన్నులకు చేరుకుంది.