నేడు గ్లోబల్ మార్కెట్‌లో మాత్రం బంగారం(gold), వెండి (silver)ధరలు తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం వెండి ధరలు తగ్గినా కూడా దేశీ మార్కెట్‌లో  ధరలు పైకి పెరగడం గమనార్హం. గత రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర(gold price) నేడు మాత్రం కొద్దిగా పెరిగింది. బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా పయనిస్తుంది.

నేడు సోమవారం బంగారం, వెండి ధరల్లో కాస్త తగ్గుదల నమోదైంది. ఈరోజు బంగారం ధర పది గ్రాములకు రూ.60 దిగోచ్చింది. అలాగే వెండి ధరలో కిలోకు రూ.150 తగ్గుదల కనిపిస్తోంది. ఆల్ టైమ్ హై గురించి మాట్లాడితే గత 17 నెలల్లో బంగారం ధర పది గ్రాములకు రూ.8800 తగ్గింది.

ఎం‌సి‌ఎక్స్ లో గోల్డ్ ఫ్యూచర్స్ 0.16% తగ్గి రెండు నెలల కనిష్ట స్థాయికి 10 గ్రాములకు రూ.47,375 ఉండగా, సిల్వర్ ఫ్యూచర్స్ 0.31% తగ్గి కిలోకు రూ.60,420 కి పడిపోయింది. శుక్రవారం సెషన్‌లో బంగారం ధర ఫ్లాట్‌గా ముగియగా, వెండి 0.4% పెరిగింది. గ్లోబల్ మార్కెట్లలో బంగారం ఔన్స్‌కి 1,795 డాలర్లకి చేరుకుంది, అయితే జనవరిలో గరిష్టంగా 1,831 డాలర్ల వద్ద ఉంది.

ఇదిలా ఉండగా సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2021-22 - సిరీస్ IX నేటి నుండి సబ్‌స్క్రిప్షన్ కోసం ఓపెన్ కానుంది. సోమవారం నుండి ఐదు రోజుల పాటు ఈ సబ్‌స్క్రిప్షన్ ఉంటుంది. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2021-22 తదుపరి విడత ఇష్యూ ధర గ్రాముకు రూ.4,786 గా నిర్ణయించబడిందని ఆర్‌బి‌ఐ శుక్రవారం తెలిపింది. 

మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ డోమస్టిక్ ఫ్యూచర్స్ మార్కెట్లో బంగారం ధర గురించి మాట్లాడితే బంగారం పది గ్రాములు రూ.47362 వద్ద ఉంది. వెండి గురించి మాట్లాడితే ఉదయం 9:20 గంటలకు వెండి కిలో రూ.250 తగ్గి రూ.60,358 వద్ద ట్రేడవుతోంది. శుక్రవారం నాడు కిలో వెండి ధర రూ.60607తో ముగిసింది.

పెట్టుబడిదారులు బంగారాన్ని ఒక ముఖ్యమైన పెట్టుబడిగా చూస్తారు. సమాచారం ప్రకారం భారతదేశంలో గత సంవత్సంర బంగారం డిమాండ్ తగ్గుముఖం పట్టింది. అయితే, ఒకానోక సందర్భంలో బంగారం వినియోగం పరంగా చైనాని కూడా భారత్ అధిగమించింది. నిజానికి, భారతదేశంలో ఆభరణాల డిమాండ్ తగ్గి బంగారం డిమాండ్ గత కొన్ని సంవత్సరాలలో గణనీయంగా పెరిగింది. ఇ-గోల్డ్ అండ్ గోల్డ్ ఈటీఎఫ్ లు వంటి ప్రత్యామ్నాయాలు ఉన్నా పెట్టుబడిదారులు మాత్రం బంగారాన్ని ప్రస్తుతం ఉన్న భౌతిక రూపంలోనే కొనేందుకు ఆసక్తి చూపించారు.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 43,900 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలు రూ.47,890 గా ఉంది. బెంగళూరులో బంగారం ధరల విషయానికొస్తే 22 క్యారెట్ల 10 తులం బంగారం ధర 43,900 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరలు రూ.47,890గా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్ లో పసిడి, వెండి ధరల హెచ్చుతగ్గులు, విదేశీ మారక ద్రవ్యంలో మార్పుల ఆధారంగా దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో పెరుగుదల, తగ్గుదల చోటుచేసుకుంటుందనే సంగతి తెలిసిందే. కాగా బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయని గమనించాలి.