వెండి ధర భారీగా పెరిగింది. గత నాలుగు రోజులుగా పెరుగుతూ వస్తున్న వెండి ధర ఈ రోజు కూడా పెరిగింది. నేటి బులియన్ మార్కెట్లో రూ.440 పెరిగి కేజీ వెండి ధర రూ.40వేల మార్క్ ని చేరింది.  కేజీ వెండి ధర రూ.40,140కి చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీ దారుల నుంచి డిమాండ్  పెరగడంతో.. వెండి ధర అమాంతం పెరిగినట్లు ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఇదిలా ఉండగా.. పసిడి ధర మాత్రం స్వల్పంగా తగ్గింది.  డాలర్ తో రూపాయి బలపడటం, స్థానికంగా కొనుగోళ్లు తగ్గిపోవడంతో బంగారం దిగి వచ్చింది. నేటి బులియన్ మార్కెట్లో  రూ.145 తగ్గి పది గ్రాముల బంగారం ధర రూ.32,690కి చేరింది. గడిచిన  మూడు రోజుల్లో బంగారం ధర రూ.565 పెరగగా.. నేడు మాత్రం స్వల్పంగా తగ్గింది.