Asianet News TeluguAsianet News Telugu

పండగ సీజన్ లో బంగారం ధరలు పెంపు.. టాప్ ఇండియన్ నగరాల్లో కొత్త ధరలను ఇవే..

బెంగళూరులో స్టాండర్డ్ బంగారం (99.5 స్వచ్ఛత) 10 గ్రాముల ధర రూ. 51,950 వద్ద ట్రేడవుతుండగా, ముంబైలో స్టాండర్డ్ బంగారం (99.5 స్వచ్ఛత) ధర రూ.50,185 కాగా, స్వచ్ఛమైన బంగారం (99.9 స్వచ్ఛత) రూ.50,387గా ఉంది.
 

Gold Prices Rise On Tuesday. Check Latest Prices On Oct 4 In Top Indian Cities
Author
First Published Oct 4, 2022, 9:32 AM IST

పండుగ సీజన్‌లో బంగారం ధరలు పెరుగుతున్నాయి, ఇదే జోరు కొనసాగే అవకాశం ఉంది. హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ ప్రకారం, దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.161 పెరిగి రూ.50,682కి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధరల పెరుగుదల నేపథ్యంలో ఈ పెంపు జరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 1,665.1 డాలర్లుగా, వెండి ధర ఔన్సుకు 19.36 డాలర్లు పెరిగింది.

బెంగళూరులో స్టాండర్డ్ బంగారం (99.5 స్వచ్ఛత) 10 గ్రాముల ధర రూ. 51,950 వద్ద ట్రేడవుతుండగా, ముంబైలో స్టాండర్డ్ బంగారం (99.5 స్వచ్ఛత) ధర రూ.50,185 కాగా, స్వచ్ఛమైన బంగారం (99.9 స్వచ్ఛత) రూ.50,387గా ఉంది.


వెండి ధర కూడా కిలోకు రూ.1,010 పెరిగి రూ.58,039కి చేరుకుంది.

స్టాక్ మార్కెట్‌లో ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో బంగారం ధర 10 గ్రాములకు రూ.205 పెరిగి రూ.50,399కి చేరుకుంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో డిసెంబర్ డెలివరీ కోసం బంగారం కాంట్రాక్ట్‌లు రూ. 205 లేదా 0.41 శాతం పెరిగి 10 గ్రాములకు రూ. 50,399 వద్ద 17,446 లాట్ల వ్యాపార టర్నోవర్‌లో ట్రేడ్ అయ్యాయి.  

 ఈ నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరలు ఇలా ఉన్నాయి
నగరాలు    22-క్యారెట్  24-క్యారెట్ 
చెన్నై       రూ.47,050    రూ.51,330
ముంబై     రూ.46,850    రూ.51,110
కోల్‌కతా    రూ.46,850    రూ.51,110
హైదరాబాద్    రూ.47,850    రూ.51,110
నాసిక్         రూ.46,880    రూ.51,140
పూణే          రూ.46,880    రూ.51,140
వడోదర      రూ.46,880    రూ.51,140
అహ్మదాబాద్ రూ.46,900    రూ.51,160
లక్నో          రూ.47,000    రూ.51,280
చండీగఢ్    రూ.47,000    రూ.51,280
సూరత్       రూ.46,900    రూ.51,160
విశాఖపట్నం రూ.46,850    రూ.51,110
భువనేశ్వర్    రూ.46,850    రూ.51,110
మైసూర్         రూ.47,900    రూ.51,160

స్థానిక ధరలు ఇక్కడ చూపిన వాటి కంటే భిన్నంగా ఉండవచ్చు.  పైన పేర్కొన్న లిస్ట్ భారతదేశంలోని వివిధ నగరాల్లో ప్రతి 10 గ్రాముల 22 క్యారెట్ల, 24-క్యారెట్ల బంగారం ధరలకు సంబంధించినది.  

Follow Us:
Download App:
  • android
  • ios