భారీగా తగ్గిన బంగారం ధర

First Published 18, Jul 2018, 4:24 PM IST
Gold Prices Plunge To 5-Month Low
Highlights

ఐదు నెలల కనిష్ఠానికి చేరిన బంగారం ధర

బంగారం ధర తగ్గుముఖం పట్టింది. బుధవారం నాటి మార్కెట్ లో బంగారం ఐదు నెలల కనిష్ఠానికి చేరుకుంది. నేటి బులియన్ మార్కెట్లో రూ.250 తగ్గి పది గ్రాముల (తులం) బంగారం రూ.30,800కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం... స్థానిక బంగారం కొనుగోలుదారుల నుంచి డిమాండ్ తగ్గడంతో పసిడి ధర పడిపోయినట్లు తెలుస్తోంది.

ఇక వెండి కూడా పసిడి బాట పట్టింది. నేటి మార్కెట్లో రూ.620 తగ్గి కేజీ వెండి ధర రూ.39,200కు చేరుకుంది. వెండి నాణేల తయారీ దారుల నుంచి కొనుగోళ్లు మందగించడం కారణంగా వెండి ధర తగ్గినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇక అంతర్జాతీయ మార్కెట్లో.. ఔన్సు బంగారం 1,227.78డాలర్లుగా ఉంది. నిపుణుల అంచనాల ప్రకారం.. ఈ నెలాఖరుకి పదిగ్రాముల బంగారం రూ.29,500లకు చేరుకునే అవకాశం ఉంది.

దేశరాజధాని ఢిల్లీలో 99.9స్వచ్ఛత గల పదిగ్రాముల బంగారం ధర రూ.30,800గా ఉండగా.. 99.5స్వచ్ఛతగల పదిగ్రాముల బంగారం ధర రూ.30,650గా ఉంది. 

loader